టర్కీ కోడి కూర.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..!
నాన్ వెజ్ రెసిపీలలో చికెన్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చికెన్ తో ఫ్రై, కూర, పచ్చడి, స్నాక్స్ ఇలా రకరకాల వెరైటీలు చేస్తుంటారు. ఏ వెరైటీ చేసినా వద్దనకుండా లాగించేస్తుంటారు. ఇక మటన్, ఫిష్ తినని పిల్లలకు చికెన్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. అయితే, చికెన్‌తో ఎప్పుడూ చేసేలా కాకుండా టర్కీ కోడి కూరను ట్రై చేశారు. ఇలా చేస్తే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి సూపర్ టేస్టీ టర్కీ కోడి కూరను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
టర్కీ కోడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. టర్కీ కోడి మాంసం అర కిలో, అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, ధనియాల పొడి, చికెన్ మసాలా, టమాటాలు, కొత్తిమీర తరుగు తీసుకోవాలి. అయితే ఈ వంట చేయడానికి ముందుగా కోడి మాంసాన్ని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి.
ఇక తయారీ విధానం చూస్తే ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చినచెక్క వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , టమోటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత ఆ మిశ్రమంలో మ్యారినేట్ చేసిన టర్కీ మాంసాన్ని వేయాలి. ఇప్పుడు మూత పెట్టి రెండు గ్లాస్ ల నీళ్లు పోసి అలా మీడియం ఫ్లేమ్ పై బాగా ఉడికించుకోవాలి.

ఇప్పుడు గ్రేవీ కావాలనుకుంటే ఆ మిశ్రమంలో కొన్ని కొబ్బరి పాలు పోసి మిక్స్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా ఆ మిశ్రమంలో అర కట్ట కొత్తిమీర వేస్తే సరి.. సూపర్ టేస్టీ టర్కీ కోడి కూర రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications