మొలకెత్తిన మెంతులు.. ఆ వ్యాధికి దివ్య ఔషధం..!
ప్రతి కిచెన్ లో మెంతులు తప్పనిసరిగా ఉంటాయి. మెంతులకు వంటకాల్లో రుచితో పాటు అనేక ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మెంతుల్లో రాగి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఐరన్, కాల్షియం, రైబోఫ్లావిన్, మాంగనీసుతోపాటు.. విటమిన్లు ఎ, బి6, సీ, కే ఇలాంటి పోషకాలెన్నో మెండుగా ఉంటాయని చెబుతున్నారు.
అలాగే మొలకెత్తిన మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. బరువు తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా మెంతులు మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తినడం, సలాడ్స్, సూప్స్, స్నాక్స్ వంటి వాటిలో ఉపయోగించడం ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు. మెంతుల వల్ల కలిగే లాభాలను ఇలా వివరిస్తున్నారు.
మెంతులు బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ లో కీలకంగా ఉంటాయని చెబుతున్నారు. మొలకెత్తిన మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం ఉన్న వారు మెంతులు తీసుకుంటే.. ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. నీటిలో కరిగే పీచు ఇందులో దండిగా ఉంటుంది. అది పిండి పదార్థాలను గ్రహించుకోవడాన్ని నెమ్మదింపజేస్తుందని ఫలితంగా గ్లూకోజు మోతాదులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే మెనోపాజ్ వచ్చిన మహిళలు మెంతులను కచ్చితంగా తినాలని వైద్యులు చెబుతున్నారు. మొలకెత్తిన గింజల రూపంలో మెంతులను తినడం వల్ల హార్మోన్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. అంతేకాక ఆస్ట్రేలియాలో ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో మెంతి రసం తాగడం వల్ల పురుషులలో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయని తేలింది. మెంతి గింజల పానీయాన్ని 6 వారాల పాటు నిరంతరాయంగా తాగడం వల్ల సెక్స్ డ్రైవ్, లైంగిక పనితీరు పెరుగుతుందని అధ్యయనంలో కనుగొన్నారు నిపుణులు.

బరువు తగ్గడానికీ మొలకెత్తిన మెంతులు ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మెంతులను తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ స్థాయిలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications