శరీరంలో యూరిక్ యాసిడ్ పెంచే కూరగాయలు.. ఎక్కువ తిన్నారో..?
యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ప్యూరిన్ అనే పదార్థం విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే ఒక రకమైన వ్యర్థ పదార్థం. ది సాధారణంగా మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది, కానీ ఎక్కువ పరిమాణంలో ప్యూరిన్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ స్థితి హైపరు యూరిసీమియా అని పిలుస్తారు, ఇది గౌట్, కిడ్నీ రాళ్లు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఈ సమస్యను నియంత్రించడానికి ఆహారం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, అన్ని కూరగాయలు ఆరోగ్యకరమైనవి అనుకోవడం పొరపాటు. కొన్ని కూరగాయలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే అవకాశం ఉంది. కనుక ప్యూరిన్లు అధికంగా ఉండే కొన్ని కూరగాయలను తగ్గించడంలో జాగ్రత్తగా ఉండటం అవసరం.

యూరిక్ యాసిడ్‌ను పెంచే కూరగాయలు:
కొన్ని కూరగాయలు ప్యూరిన్‌లను ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రతి వ్యక్తికి ఈ స్థాయిలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ఈ కూరగాయలను తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి.
వంకాయ: వంకాయలో ప్యూరిన్లు పుష్కలంగా ఉంటాయి. వంకాయను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి మరింత పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో మంట కూడా ఏర్పడవచ్చు.
బెండకాయ: బెండకాయలో కూడా ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. బెండకాయ తినడం వల్ల శరీరంలో ప్యూరిన్ పరిమాణం పెరుగుతుంది. బెండకాయలో కీళ్ల నొప్పులను, వాపులను అభివృద్ధి చేసే లక్షణాలు అధికంగా ఉంటాయి.
క్యాలీఫ్లవర్ : క్యాలీఫ్లవర్‌లో ప్యూరిన్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. గౌట్ రోగులు దీన్ని మితంగా తీసుకోవడం మంచిది. బ్రోకలీలో కూడా ప్యూరిన్లలో మధ్యస్థ స్థాయి కలిగి ఉంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ నిల్వ ఎక్కువగా పెరగవచ్చు.
క్యాబేజీ : క్యాబేజీలో ప్యూరిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి. బీన్స్‌లో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యను పెంచుతాయి.
పుట్టగొడుగులు: పుట్టగొడుగులలో యూరిక్ యాసిడ్ పెంచడానికి పని చేసే ప్రొటీన్లు మంచి మొత్తంలో ఉంటాయి. బచ్చలి కూరలో ప్రోటీన్, ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి.
శనగలు : శనగల్లో ప్యూరిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మోతాదులో తీసుకుంటే గౌట్ లక్షణాలు పెరగవచ్చు. అరటికాయలో ప్యూరిన్ సమృద్ధిగా ఉంటుంది, ఇది యూరిక్ యాసిడ్ స్థాయిల పెరుగుదలకు కారణం అవుతుంది.
యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేయడం కోసం:
ఈ కూరగాయలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ, వాటి తీసుకునే మోతాదును తగ్గించడం ఉత్తమం. అధిక ప్యూరిన్లు కలిగిన ఆహారంతో పాటు అధిక నీటిని తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ శరీరం నుండి త్వరగా బయటికి వెళ్తుంది. పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం ద్వారా సరైన ఆహార నియమాలను పాటించవచ్చు. అల్కలైన్ ఆహారాలు, పండ్లు, ఆకుకూరలు అధికంగా తీసుకోవడం మంచిది. విటమిన్ C అధికంగా ఉండే ఆహారాలు , నీరు తరచూ తాగడం ద్వారా మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ విడుదలను పెంచవచ్చు












Click it and Unblock the Notifications