health tips: నడక వర్సెస్ సైక్లింగ్ .. ఏది ఎక్కువ ప్రయోజనకరం?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతినిత్యం వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది వ్యాయామంలో భాగంగా నడకను, సైక్లింగ్ ని ఎంచుకుంటారు. అయితే నడక మంచిదా? సైక్లింగ్ మంచిదా? ఏది చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అన్నది చాలామందిలో ఉండే సందేహం. ఇక ఈ సందేహానికి సమాధానం ప్రస్తుతం మనం చూద్దాం.

నడక, సైక్లింగ్ రెండు మంచివే. అయితే వాకింగ్ చేయడం వల్ల శరీరం ఖర్చు చేసే క్యాలరీల కంటే, సైక్లింగ్ చేయడం వల్ల మన శరీరం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. నడక కంటే, సైక్లింగ్ చేయడం వల్ల మోకాలు, చీలమండల కీళ్లు తక్కువగా అరిగుతాయి. తక్కువ ప్రభావం కారణంగా నడకతో పోలిస్తే సైకిల్ తొక్కడం ఎక్కువసేపు చేయవచ్చు.

Walking vs Cycling .. which is more beneficial?

నడక, సైకిల్ తొక్కడం రెండు కార్డియో వాస్కులర్ ఫిట్నెస్ ను మెరుగు పరుస్తాయి. సైకిల్ తొక్కడం వల్ల సత్తువ పెరుగుతుంది. గుండె మరియు ఊపిరితిత్తులకు కూడా మంచిది. కండరాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. ప్రతిరోజు సైక్లింగ్ చేయడం వల్ల శారీరిక బలం పెరుగుతుంది. తుంటి, కాలు, తొడ కండరాలు సైకిల్ తొక్కడం వల్ల బలంగా మారుతాయి.

నడక, సైక్లింగ్ రెండు శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అయితే నడిస్తే మంచిదా సైకిల్ తొక్కితే మంచిదా అనేది ఎవరికి వారు వారి సౌలభ్యాన్ని బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు అరగంట పాటు సైకిల్ తొక్కినా, లేదా అరగంట పాటు నడిచినా ప్రయోజనం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నడక విషయానికి వస్తే సాధారణ వేగంతో నడవడం పెద్దగా సహాయపడదు. వేగంగా నడిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇక సైక్లింగ్ విషయంలో కూడా వేగంగా తొక్కితేనే ఫలితం బాగా ఉంటుంది. కచ్చితంగా చెప్పాలి అంటే నడకతో పోలిస్తే సైక్లింగ్ తోనే రిజల్ట్ బాగుంటుంది. అయితే సైకిల్ తొక్కడం రానివారు ప్రతిరోజు నడవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా క్రమం తప్పకుండా చేస్తేనే ఫలితం అనుకున్నట్టు ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+