గుండెపోటు రావడానికి ముందు కనపడే లక్షణాలు ఇవే
మనిషి శరీరంలో అతి ముఖ్యమైంది గుండె. ఇప్పటి రోజుల్లో మాత్రం వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది.సెకనులో వచ్చే గుండెపోటు మనిషి ప్రాణాలను తీస్తుంది. గుండెపోటు సంభవించడానికి ముందు కొన్ని సంకేతాలు కనపడతాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఆ లక్షణాలేంటనేది తెలుసుకుందాం.
జిమ్ చేస్తున్నప్పుడు, నిద్రలో వున్నప్పుడు, ఇతర పనులు చేస్తున్నప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చిన సందర్భాలు కోకొల్లలు. ఛాతీలో నొప్పి రావడంతోపాటు అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడంలాంటివి గుండెపోటుకు కారణాలయ్యే అవకాశం ఉంది. కొంతమందికి గ్యాస్ట్రిక్, అసిడిటీ వల్ల కడుపు నొప్పి వస్తుంది. కడుపు మధ్య భాగంలో సంభవించే మంట, వచ్చే నొప్పి గుండెజబ్బులకు కారణమవుతాయి.

హార్ట్ ఎటాక్ రావడానికి ముందు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంటుంది. ఛాతీలో నొప్పిగా ఉండటంతోపాటు చిన్న చిన్న పనులకే అలసిపోతుంటారు. నీరసానికి గురవుతారు. కొద్దిసేపు నడిచినాయ ఆయాసం వస్తుంటే గుండె విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడంతోపాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచి ఆరోగ్యంగా ఉన్నట్లే. గుండె సంబంధిత సమస్యలకు చెక్ చెప్పాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడంతోపాటు ప్రాణాయామం, ధ్యానం, యోగా వంటివి చేస్తుండాలి.
గుండెకు నిరంతరం రక్తం సరఫరా అవుతుండాలి. సరఫరాలో ఏమాత్రం చిన్న లోపం కనిపించి నిలిచిపోతే శరీరంలోని మొత్తం వ్యవస్థ స్తంభించిపోతోంది. కొవ్వు పేరుకుపోవడంవల్లే గుండెకు రక్త సరఫరా నిలిచిపోతుంది. రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోవడంతో రక్తం ప్రవహించే మార్గం కుచించుకుపోయి గుండెకు రక్తసరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా గుండె కండరాలకు ఆక్సిజన్, పోషకాలు అందక కండరాలు చచ్చుబడి గుండె పోటు ఏర్పడుతుంది.












Click it and Unblock the Notifications