ఆయుర్వేదంలో శిలాజిత్ అంటే ఏమిటి? ఎందుకు ఉపయోగిస్తారు?
ఆయుర్వేదంలో శిలాజిత్‌ను ఒక ముఖ్యమైన ఔషధంగా పరిగణిస్తారు. ఇది హిమాలయ పర్వతాల వంటి ఎత్తైన ప్రాంతాల్లోని శిలల నుండి ఊరే జిగురు లాంటి పదార్థం. వందల ఏళ్లపాటు మొక్కలు కుళ్ళిపోయి, శిలల ఒత్తిడికి గురికావడం వల్ల ఇది ఏర్పడుతుంది. శిలాజిత్‌ను సంస్కృతంలో "శిలాజితు" లేదా "శిలాజతు" అంటారు. దీని అర్థం "పర్వతాలను జయించేది, బలహీనతను నాశనం చేసేది" అని.
శిలాజిత్‌ను ఎందుకు ఉపయోగిస్తారు?
ఆయుర్వేదం ప్రకారం శిలాజిత్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడటంతోపాటు యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరానికి శక్తిని అందించి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. నాడీ వ్యవస్థను బలపరిచి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఎముకల సాంద్రతను పెంచడానికి సహాయపడుతుంది, వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. పురుషులలో టెస్టోస్టెరోన్ స్థాయిని పెంచడానికి, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. స్త్రీలలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఇనుము స్థాయిని పెంచుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది. శరీరంలో వాపు, నొప్పిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
ఉత్తర భారతదేశం, నేపాల్ ప్రజలు శిలాజిత్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. పిల్లలకు దీన్ని పాలతో కలిపి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇస్తారు. షెర్పా ప్రజలు తమ ఆహారంలో శిలాజిత్‌ను ఒక భాగంగా చేసుకున్నారు. దీనివల్ల వారు చాలా బలంగా, ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని నమ్ముతారు. శిలాజిత్‌లో ఫుల్విక్ యాసిడ్, హ్యూమిక్ యాసిడ్, అనేక ఖనిజాలు (కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ వంటివి) మరియు ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫుల్విక్ యాసిడ్ ముఖ్యంగా పోషకాలను శరీరంలోని లోతైన కణజాలాలకు చేరవేయడంలో, శక్తి ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.












Click it and Unblock the Notifications