జుట్టు ఊడిపోకుండా ఉండటానికి ఇలా చేయండి
ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు ఊడిపోతుండటం. తలపై కిరీటంలా ఉండే వెంట్రుకలు ఒక్కొక్కటిగా రాలిపోతుంటే ఎవరికైనా బాధేస్తుంటుంది. జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు అనేకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. జుట్టు ఊడిపోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఎవరికైనా రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతుంటాయి. జన్యులోపం, హార్మోన్లలో మార్పులు, ఔషధాలు, జీవనశైలిలో మార్పులవల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది. అలా ఊడిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఆరోగ్యవంతమైన ఆహారం
జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లు అవసరం. ఆహారంలో చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, గింజలు వంటివి చేర్చుకోవాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. జుట్టు ఊడటానికి ఒక ప్రధాన కారణం ఒత్తిడి. యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాల వంటి ఒత్తిడిని తగ్గిస్తాయి. రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. ధూమపానం అలవాటు కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది. అధికంగా ఆల్కాహాల్ తాగడం వల్ల జుట్టు ఊడిపోతుంటుంది.

జుట్టు సంరక్షణ:
మీ జుట్టు రకానికి ఏ షాంపూ సరిపోతుందో దాన్నే ఉపయోగించండి. వారానికి 2-3 సార్లు మాత్రమే జుట్టును షాంపూ చేయాలి. జుట్టును చాలా వేడిగా ఆరబెట్టకూడదు. అలాగే తడిగా ఉన్నప్పుడు బ్రష్ చేయవద్దు. వేడి పరికరాలను ఉపయోగించేటప్పుడు హీట్ ప్రొటెక్టెంట్ ఉపయోగించాలి. జుట్టును క్రమం తప్పకుండా ట్రిమ్ చేయించుకోవాలి. నెయ్యితో తలకు మసాజ్ చేసుకోవాలి. నీటిలో ఉసిరికాయ రసం కలిపి జుట్టును శుభ్రం చేసుకోవడం, మెంతులు, గుడ్డు ప్యాక్ వాడటం,కొబ్బరి నూనె, ఆముదం మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుంటే మంచిది. జుట్టు మరింత తీవ్రంగా ఊడిపోతుంటే వైద్యుడిని లేదంటే వైద్యురాలిని సంప్రదించడం మంచిది.












Click it and Unblock the Notifications