Chicken vs Egg: గుడ్డు మరియు చికెన్‌లో ఏది బెస్ట్.. పోషకాలు, ఆరోగ్య బెనిఫిట్స్ తెలుసుకోండి
Protein food: పిల్లల నుంచి పెద్దల వరకు రోజువారీ ఆహారంలో కోడిగుడ్లు, చికెన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యం కోసం రోజుకో గుడ్డు తీసుకుంటూ, ఆదివారం వస్తే చికెన్ తప్పనిసరిగా ఉండేలా చూసుకునేవారు కోకొల్లలు. ఈ రెండూ కోడికి సంబంధించినవే కాగా ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మరి వీటిలో ఏది తినడం మంచిదో తెలుసుకుందాం.
చికెన్ మరియు గుడ్లలో విటమిన్లు మరియు మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రెండింటినీ తగినంత పరిమాణంలో తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణను ప్రోత్సహిస్తాయి. బరువు తగ్గడంతో పాటు వెయిట్ నిర్వహణలో సహాయపడతాయి. హృదయారోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి.

పోషకాహార నిపుణుల ప్రకారం ఈ రెండింటినీ పోల్చి చూస్తే.. 100 గ్రాముల చికెన్‌లో 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే ఉడికించిన గుడ్లలో అయితే 12.6 గ్రాములు మాత్రమే ఉంటుంది. చికెన్ మరియు గుడ్డు రెండూ కూడా పూర్తిస్థాయి ప్రొటీన్లు కలిగిన ఆహారపదార్థాలుగా ప్రసిద్ధి చెందాయి. అయినప్పటికీ గుడ్డుతో పోలిస్తే చికెన్ లో వీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది.
ఈ రెండింటిలో శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి ప్రోటీన్ సంశ్లేషణలో సహాయపడతాయి. చికెన్ మరియు గుడ్లు రెండూ కూడా మొక్కల ప్రోటీన్‌ల కంటే మెరుగ్గా జీర్ణమవుతాయి. ప్రతిరోజూ తప్పనిసరిగా తినాల్సిన పోషకాలుగా వీటిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి కండరాలను నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ, హార్మోన్లు మరియు న్యూరోట్రాన్స్‌మిటర్‌లను సృష్టించడంలో సహాయపడతాయి.
గుడ్డు కంటే ఎక్కువ ప్రొటీన్లు ఉన్నప్పటికీ చికెన్ జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. గుడ్లు 97 శాతం, చికెన్ 94 శాతం చొప్పున డైజెస్ట్ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనర్థం చికెన్ కంటే గుడ్లు అమినో యాసిడ్‌లను ఎక్కువగా ఉపయోగించగలవు. చికెన్ తీసుకోవడం ద్వారా B విటమిన్లు మరియు ఐరన్ వంటి పోషకాలు శరీరానికి సమృద్ధిగా అందుతాయి. ఇక గుడ్లు కేవలం ప్రోటీన్స్ మాత్రమే కాకుండా B12 మరియు కోలిన్ వంటి ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలకు నిలయం. రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు గుడ్లు దురం పెట్టడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications