నల్లజుట్టు కోసం సింపుల్ చిట్కా

ఒకప్పుడు వయసు పెరుగుతూ ఆ ప్రభావానికి లోనై నల్ల జుట్టు కాస్తా తెల్ల జుట్టుగా క్రమక్రమంగా మారుతూ వస్తుంటుంది. వయసు ప్రభావం కాబోలు అనుకునేవారు. ఇప్పుడు మాత్రం మారిన జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చిన్నా, పెద్దా తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరికీ తెల్ల జుట్టు వస్తోంది. కొంతమంది ఖరీదైన శస్త్రచికిత్సల ద్వారా నల్లగా మార్చుకుంటున్నప్పటికీ కొన్నాళ్ల తర్వాత మళ్లీ అది తెలుపు రంగులోకి మారుతోంది.తెల్ల జుట్టు నుంచి నల్ల జుట్టుగా మార్చే మంచి రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తెల్ల జుట్టును నల్ల జుట్టుగా మార్చడంలో నల్ల కలోంజి గింజలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. కలోంజిలో జుట్టుకు సంబంధించిన స్కాల్ప్ ను శుభ్రం చేయడానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రును పూర్తిగా నివారిస్తాయి. వీటినే జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కొంతమందికి చిన్న వయసులోనే జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. అటువంటివారు కలోంజిలో కొబ్బరినూనె కలిపి సిద్ధం చేయాలి.

Hair

కొబ్బరి నూనెలో కలోంజి గింజలను 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టాలి. అది చల్లారిన తర్వాత వడగట్టి రాత్రివేళ జుట్టుకు పట్టించాలి. కుదుళ్లకు కూడా అంటుకునేలా చిన్నగా మర్దనా చేసి నూనెను అప్లై చేయాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల తెల్ల వెంట్రుకలు నల్లగా మారతాయి.

కలోంజీతో పాటు హెన్నాను కూడా వాడొచ్చు. కలోంజీ గింజలను గిన్నెలో తీసుకుని మెత్తగా రుబ్బాలి. అందులో హెన్నా కలిపి పేస్ట్‌లా చేసి జుట్టు మీద అప్లై చేసి కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో జుట్టును కడగాలి. తర్వాత జుట్టు నల్లగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+