లోబీపీ ఎందుకు వస్తుంది? తగ్గాలంటే ఏం చేయాలి?

లోబీపీ లేదా హైపోటెన్షన్ అనేది రక్తపోటు స్థాయి సాధారణ పరిమితుల కంటే తక్కువగా ఉంటే ఏర్పడే పరిస్థితి. ఇది చాలా మందిలో కనిపించే సమస్య. సాధారణ రక్తపోటు 120/80 mmHg గా ఉంటుంది. దీనిలో 90/60 mmHg కంటే తక్కువగా ఉంటే దానిని లోబీపీగా పరిగణిస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం కలిగిస్తుంది.

లోబీపీకి కారణాలు
శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్‌ను దారితీస్తుంది. దీని వల్ల రక్తపోటు తగ్గిపోతుంది. పోషక లోపాలు కూడా లోబీపీకి కారణమవుతాయి. ముఖ్యంగా ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉండడం వల్ల రక్తహీనత, దాంతోపాటు లోబీపీ కూడా వస్తుంది. ఆకస్మికంగా నిల్చోవడం లేదా శరీర ద్రవాలు తగ్గించడం వల్ల రక్తప్రసరణలో లోపం కలుగుతుంది. క్షతగాత్రం లేదా శస్త్రచికిత్సల వల్ల అధిక రక్తనష్టం జరిగితే రక్తపోటు పడిపోతుంది. థైరాయిడ్ సమస్యల వల్ల లేదా అడ్రినల్ గ్రంధి సరిగా పనిచేయకపోవడం వల్ల లోబీపీ కలగవచ్చు. కొన్ని రకాల మందులు, డయూరెటిక్ మందులు తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.

Why does low blood pressure occur What can be done to reduce it

లోబీపీ లక్షణాలు
లోబీపీ వల్ల ప్రధానంగా తల తిరుగడం, అలసట, మగత, గుండె వేగం తగ్గడం , బలహీనత, చల్లగా ఉండే చర్మం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం , వికారం, వాంతులు , అపస్మారం స్థితిలోకి వెళ్లడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.

లోబీపీ తగ్గించడానికి చర్యలు
లోబీపీ ఉన్నవారు రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం. సోడియం తక్కువగా ఉన్నప్పుడు రక్తపోటు తగ్గుతుంది. లావణ్యం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండం మంచిది. చల్లని పరిస్థితుల్లో లేదా అలసట అనిపించినప్పుడు వేడి కాఫీ తాగడం ఉపశమనం కలిగిస్తుంది. పడుకోవడం లేదా కూర్చుని ఉండేటప్పుడు కాళ్లను కొంచెం ఎత్తుగా ఉంచడం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది . రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒకేసారి అధికంగా తినకుండా, తరచుగా తక్కువ మోతాదుల్లో ఆహారం తీసుకోవడం ద్వారా రక్తపోటు నియంత్రించవచ్చు.

పోషక ఆహారాలు
లోబీపీ ఉన్న వారు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండం మంచిది. బాదం, జీడిపప్పు, అరటి, ద్రాక్ష, కివి, సూప్, జ్యూస్, గుడ్లు, పాలు, చేపలు వంటి వాటిని తీసుకోవడం మంచిది. లోబీపీ కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమవుతుందని గమనించాలి. తరచుగా లోబీపీ అనుభవిస్తుంటే, అసలు కారణాన్ని కనుగొని సముచిత చికిత్స పొందేందుకు వైద్యుడిని సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+