సంక్రాంతి స్పెషల్: కొత్త అల్లుళ్లకు తలకాయ కూర. ఎందుకంటే?

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయ వంటకాలపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా పండుగకు ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లకు పెట్టే మెనూ చూస్తే మనకు కూడా ఇలా పండక్కి పిలిచి ఇన్ని వెరైటీలు పెడితే ఎంత బాగుండో అని కచ్చితంగా మనసులో అనుకోని వారు ఉండరు. ఇక గోదావరి జిల్లాల సైడ్ అయితే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందల రకాల వెరైటీలు ఒక ఎత్తు.. కొత్త అల్లుడికి పెట్టే తలకాయ కూర మరో ఎత్తు. మటన్ లో ఉన్న మ్యాజిక్ ఏంటి? ముక్కు దిగితేనే పండగ మూడ్ యాక్టివేట్ అవుతుందా? మేక తలకాయ కూరలో ఉండే పోషకాలేంటో తెలుసుకోండి

మేక తలకాయ కూరకు ప్రత్యేక స్థానం ఉంటోంది. రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఇది ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నాన్ వెజ్ ప్రియులకు మటన్ ఎంతో ఇష్టమైన ఆహారం కాగా, మటన్‌లోని వివిధ భాగాల్లో మేక తలకాయ అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రోటీన్, విటమిన్ B12, ఐరన్, ఫాస్పరస్‌తో పాటు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా దీర్ఘకాల ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి.

Why Goat Head Curry Is a Sankranti Special for New Sons-in-Law Tradition Meets Nutrition

పోషక నిపుణుల ప్రకారం, మేక తలకాయ కూర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్ B12, ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే గ్లూకోసమైన్, కాండ్రాయిటిన్ వంటి పదార్థాలు కీళ్ల నొప్పులను తగ్గించి ఎముకల బలాన్ని పెంచుతాయి.

ఇక గుండె ఆరోగ్య పరంగా కూడా మేక తలకాయ కూర ఉపయోగకరమేనని వైద్యులు చెబుతున్నారు. ఒమేగా-3 ఫ్యాటి ఆసిడ్స్ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు మానసిక అలసటను తగ్గించడంలో కూడా ఈ వంటకం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

కళ్ల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ A, చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి దోహదపడే విటమిన్ C కూడా మేక తలకాయలో ఉండటం విశేషం. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షించడంలో తోడ్పడతాయని నిపుణులు వివరిస్తున్నారు.

తయారు చేసుకునే విధానం...

వంట విధానం విషయానికి వస్తే, మేక తలకాయ కూరను సాధారణ మటన్ కూరలా కాకుండా ప్రత్యేక శ్రద్ధతో తయారు చేయాలి. తలకాయను బాగా శుభ్రపరచి ఉప్పు, పసుపుతో నానబెట్టి, మసాలాలతో మరిగించి కుక్కర్‌లో ఉడికిస్తారు. చివరగా కొబ్బరి, గరం మసాలా, కొత్తిమీరతో కూరను పూర్తి చేస్తారు. సంక్రాంతి భోజనంలో ఈ వంటకం ఉంటే భోజనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

సంప్రదాయం, ఆరోగ్యం, రుచి... ఈ మూడు కలయికగా మేక తలకాయ కూర నిలుస్తోంది. అందుకే సంక్రాంతి పండుగకు కొత్త అల్లుళ్లకు ఈ వంటకం వడ్డించడం తెలుగు కుటుంబాల్లో ఇప్పటికీ ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+