భార్యాభర్తల బంధం బీటలు వారొద్దు అంటే ఇవి తప్పక అలవాటు చేసుకోవాలి!

ఇటీవల కాలంలో భార్యాభర్తల అనుబంధాలు బీటలు వారుతున్నాయి. ఏ సంబంధమైనా ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంతోనే బలపడుతుంది. భార్యాభర్తల మధ్య బంధం కూడా నమ్మకం,ప్రేమ, గౌరవంతోనే ముడిపడి ఉంటుంది. బిజీ లైఫ్ లో ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించలేక భార్యాభర్తల మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఫలితంగా వివాహేతర సంబంధాలు, విడాకులు ఇలా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది.

భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే ఇలా చెయ్యాలి

అయితే భార్యాభర్తల మధ్య బంధం కాలంతో పాటు మరింత గట్టిపడాలంటే రోజువారీ జాగ్రత్త అవసరం. కొన్ని సాధారణ అలవాట్లు మార్చుకుంటే మళ్ళీ భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం తిరిగి పెరుగుతుంది. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతీరోజూ ఇద్దరూ ఎంత బిజీ ఉన్నప్పటికీ రోజులో కొద్ది నిమిషాలైనా ఫోన్, టీవీ దూరంగా ఉంచి ప్రశాంతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి.

wife and husband Relationship these Small Habits That Can Massively Strengthen wife and husband Relationship

కమ్యూనికేషన్, అప్రిసియేషన్ అవసరం

ఎదుటివారు చెప్పేది అడ్డుకోకుండా ఓపికగా వినాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి. ఇలాచేస్తే నమ్మకం పెరుగుతుంది.ఇది వారి మధ్య కమ్యూనికేషన్ ను పెంచి, దూరం తగ్గిస్తుంది. భార్యాభర్తల మధ్య బంధం బలోపేత కావాలంటే చిన్న చిన్న ప్రశంసలు అవసరం. చిన్న చిన్న పనులను కూడా గుర్తించి అభినందిస్తే ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. థ్యాంక్యూ, చాలా బాగా చేశావు వంటి మాటలు బంధాన్ని మధురం చేస్తాయి.

పర్సనల్ ఫ్రీడమ్ తో బంధం బలోపేతం

విమర్శలు కాకుండా మంచిని హైలైట్ చేయటం భార్యాభర్తల మధ్య ప్రేమను, గౌరవాన్ని పెంచుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛ ఇవ్వటం భార్యాభర్తల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రతి ఒక్కరికీ కొంత సమయం అవసరం. ప్రతీ ఒక్కరికి వారికి తగిన అభిరుచులు ఉంటాయి. అన్ని నిర్ణయాలను గౌరవించుకోవటం ముఖ్యం. ముఖ్యమైన విషయాల్లో మాత్రం కలిసి చర్చించుకోవాలి. అవసరం అయిన చోట ఏకాభిప్రాయానికి రావాలి.

మినప వడియాల పులుసు.. ఇలా చేస్తే అన్నం మెతుకు మిగలదు!
మినప వడియాల పులుసు.. ఇలా చేస్తే అన్నం మెతుకు మిగలదు!

బంధం బలపడాలంటే ఇవి మస్ట్

భార్యాభర్తల బంధం బలోపేతం కావాలంటే చిన్న సర్ప్రైజ్‌లు కూడా అవసరమే . స్పెషల్ డేస్ లోనే కాదు అప్పుడప్పుడు చిన్న బహుమతి, ప్రేమ తో ఒక మెసేజ్ చేస్తే జీవిత భాగస్వామికి సంతోషం కలుగుతుంది. ఇవి కొత్త ఉత్సాహం తీసుకువస్తాయి. భార్యాభర్తల మధ్య బలమైన బంధం ఒక్కరోజులో రాదు. ప్రతిరోజూ చూపించే శ్రద్ధ, గౌరవం, సమయం, వారికి సంబంధించి చేసే ప్రతీ పనిలో ప్రేమ వారి బంధాన్ని అనుబంధాన్ని శాశ్వతం చేస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+