చలికాలంలో టేస్టీ 'ఉసిరికాయ రసం'.. ఎలా తయారు చేసుకోవాలి..?

ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉసిరికాయను శీతాకాలంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉసిరికాయను చాలామంది నిల్వ పచ్చడిగా చేసుకుని తింటారు. కొంతమంది డైరెక్ట్ గా తింటారు. ఇంకొంతమంది.. రోటి పచ్చడి, పులిహోర చేసుకుంటారు. అయితే ఉసిరికాయ రసం ట్రై చేశారా..? చలికాలంలో రోగాల్సి మాయం చేసే ఈ ఉసిరికాయ రసం ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?

చలికాలంలో చాలామంది జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతుంటారు. అలాంటివారు ఈ ఉసిరికాయ రసాన్ని రోజూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ ఉసిరికాయ రసం తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. ఉసిరికాయలు 4, కందిపప్పు పావు కప్పు, టీ స్పూన్ మిరియాలు, టీ స్పూన్ జీలకర్ర, టమాటా 1 , కరివేపాకు, వెల్లుల్లి తగినంత, తగినంత అల్లం, పచ్చిమిర్చి 1, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు తీసుకోవాలి.

Winter Special How to Make Delicious Usirikaya Rasam Amla Rasam at Home

ముందుగా కందిపప్పును నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఉసిరికాయలను చిన్నగా కట్ చేసుకుని మిక్సీలో వేయాలి. అందులోనే మిరియాలు, జీలకర్ర, టమాటా ముక్కలు వేయాలి. ఆ మిశ్రమాన్ని పేస్టు మాదిరిగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి తగినంత నూనె పోయాలి. నూనె వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. అందులో తగినంత ఇంగువ వేయాలి. ఆ మిశ్రమంలోనే కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వేసి కలపాలి. ఆ మిశ్రమంలో ముందుగా పక్కన పెట్టుకున్న ఉసిరికాయ పేస్టును వేసి.. అందులోనే పసుపు, ఉప్పు వేయాలి. తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. చివరిలో నానబెట్టిన కందిపప్పు వేయాలి. 3 నిమిషాలు మరిగాక.. అందులో కొత్తిమీర వేస్తే సరి.. దాంతో టేస్టీ ఉసిరికాయ రసం రెడీ అయినట్లే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+