పుంటి కూర కాదు, గోంగూర..
భార్య: పుంటి కూర చేయనా...
భర్త: పుంటి కూర ఏమిటే, గోంగూరు అనలేవా..
భార్య: ఇది తప్పు అది రైటా.. అయినా తొక్కు చేద్దామని అనుకుంటున్నా..
భర్త: మళ్లీ అదే వరుస, తొక్కేమిటే... పచ్చడి అనలేవా...
భార్య: నేను అట్లే అంటా.. తింటే తిను లేకుంటే లేదు..
కుమారుడు: మీరిద్దరు తలా ఒక్కటి అంటున్నారు. నేనేం అనాలే, అమ్మా..
తల్లి (చిరాగ్గా): ఏదో ఒకటి అని ఏడువు...
కుమారుడు గుక్క పట్టి ఏడవడం ప్రారంభించాడు.
...... ......
వారంతా కలిసి ఓ అమ్మాయిని ఏడ్పించాలని అనుకున్నారు.
గంపులోని ఓ యువకుడు రానని రాలేని ఊరికే అంటావు అని రాగం తీయడం ప్రారంభించాడు.
అమ్మాయి చెప్పు తీసి, కొట్టనని, కొట్టలేనని ఊరికే అనుకుంటావు... అంటూ చెప్పు తీసి రెండు అంటించింది.












Click it and Unblock the Notifications