అందుకే స్వెట్టర్ వేసుకున్నా...
ఓ రోజు తింగరోడు మంచి చలిలో స్నానానికి బయిలుదేరాడు....
అప్పుడు వాడి ప్రెండ్..వాడిని పిలిచి... "ఏరా...ఇంక చల్ల నీళ్లలో, చలి కాలంలో ఎలా స్నానం చేస్తావు..చలి వేస్తుంది కదా" అన్నాడు.
దానికి తింగరోడు... "అందుకే కదరా జఫ్పా...స్వెట్టర్ వేసుకుని..స్నానం చేస్తున్నా" అన్నాడు.
-------------
ఓ రోజు తింగరోడు తన వీధిలో గల్లీ క్రికెట్ ఆడుతున్నాడు.
హఠాత్తుగా వెళ్లి ఎంపైర్ ని ఓ రెండు పీకాడు.
దాంతో అందరూ అర్దం కాక వాడి చుట్టూ మూగి...."ఎందుకు కొట్టావు..కారణమేంటి?" అని అడిగారు..
దానికి తింగరోడు... "నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు వాడు నన్ను ఓవర్ అయ్యింది అని తిడుతున్నాడురా.. ఒకసారి చూసాను..మళ్లీ అదే అంటాడు. అందుకే కాలి రెండు పీకా" అన్నాడు.












Click it and Unblock the Notifications