పంచ్ డైలాగ్‌లు కాస్తా...
"ఏమయ్యా రైటరు! ఆ ముఖం అంతా గాయలేంటి...ఏమైంది అసలు.."
"పంచ్ లు బాగా వేస్తా అంటే ఆ క్రీడా సంఘం వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని నన్ను పట్టుకెళ్ళి బాక్సింగ్ రింగ్ లో పడేసారు..ఆ బాక్సరేమో కుల్లబోడిచి వదిలేసాడు సార్...." గొల్లుమన్నాడు రచయిత
--------------
సుబ్బారావ్ దేవుణ్ణి గురించి తపస్సు చేయటం తో దేవుడు ప్రత్యక్షం అయ్యాడు..
"నాయన నీ తపస్సుకు మెచ్చా ఏం వరం కావాలో కోరుకో..." అన్నాడు దేవుడు.
"ఆగండి స్వామి దేని గురించి తపస్సు చేసానో మర్చిపోయా ముందు అది గుర్తు చేయండి...ఆ తర్వాత వరాల సంగతి.." బుర్రగోక్కుంటూ అడిగాడు సుబ్బారావ్
-------------
సుబ్బారావు దేవుణ్ణి ఎలా అయిన ఇబ్బంది పెట్టే వరాలు అడగాలని తీవ్రంగా తపస్సు చేసే సరికి విధిలేక దేవుడు ప్రత్యక్షం అవుతాడు, దేవుణ్ణి చూడగానే తన వరాల లిస్టు చేతిలో పెడతాడు.
దేవుడు కూడా ఒక చీటీ సుబ్బారావ్ చేతిలో పెడతాడు. అది చూసి సుబ్బారావ్ మూర్చపోతాడు.
దాంట్లో.....ఈ రోజు నేను మౌన దీక్షలో ఉన్నా, బెటర్ లక్ నెక్స్ట్ టైం.... అని ఉంది.












Click it and Unblock the Notifications