ఎన్ని చేతులున్న గణపతిని పూజిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా..!
వినాయకచవితి.. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. అన్ని పండుగల్లో కల్లా వినాయకచవితి పండుగకి ఉండే క్రేజే వేరు. సాధారణంగా దేవదేవతలకు అవతారాలు ఉంటాయి. కానీ వినాయకుడికి ఉన్న అవతారంతో పాటు మారుతున్న కాలానుగుణంగా ప్రజల కొత్త అవతారాలు సైతం సృష్టిస్తున్నారు. నేటి కాలం తయారు చేసే గణనాథుడు సిక్సులు కొడతాడు, రాకెట్ ఎక్కి నింగిలోకి వెళతాడు. పాలిటికల్ లీడర్‌గా ప్రచారమూ చేస్తాడు. అలా ట్రెండ్‌కు తగ్గట్టుగా లంబోధరుడి రూపంలో క్రియేటివిటీ జోడిస్తున్నారు.
కాగా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజున గణపతిని ఘనంగా పూజిస్తారు. గణనాథుడు విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి, ప్రతి శుభకార్యానికి ముందు ఆయనను ఆరాధించడం మన సంప్రదాయం. అందుకే ఆరోజున గజాననుడిని పూజిస్తే అడ్డంకులు తొలగిపోతాయని, కొత్త పనులు విజయవంతంగా సాగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి ఇంటిలోనూ, ప్రతి మండపంలోనూ గణనాథుడిని ప్రతిష్టించి ఘనంగా పూజలు నిర్వహిస్తారు.

అయితే వినాయక చవితి సందర్భంగా మండపాల్లో గణపతి విగ్రహాలను రకరకాల ఆకారాల్లో ప్రతిష్టిస్తారు. కొన్నిసార్లు గణపతి నాలుగు చేతులతో, కొన్నిసార్లు ఎనిమిది చేతులతో కనిపిస్తాడు. అయితే పండితులు చెబుతున్న ప్రకారం ఎన్ని చేతులున్న గణపతిని పూజిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం..
ఎన్ని చేతులు ఉంటే శుభప్రదం?
పండితుల అభిప్రాయం ప్రకారం.. నాలుగు చేతుల గణనాథుడు సంపూర్ణతకు ప్రతీకని అంటున్నారు. ఎనిమిది చేతుల గణపతి ప్రతిమలను ప్రతిష్టించడం శుభప్రదం కాదని, కచ్చితంగా నాలుగు చేతుల గణపతినే పూజించాలని సూచిస్తున్నారు. పై రెండు చేతుల్లో పాశం, అంకుశం ఉండాలని.. కింది చేతుల్లో ఒకటి అభయహస్తం (భక్తులకు రక్షణ సూచన), మరొకటి లడ్డూ లేదా వరద ముద్రలో ఉండాలని తెలియజేస్తున్నారు. ఈ విధంగా నాలుగు చేతుల గణపతిని పూజించడం వల్ల భక్తులకు శుభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
గణపతి పూజలో పత్రి ప్రాముఖ్యత..
ఇక వినాయకుని పూజలో తప్పనిసరిగా 21 రకాల ఆకులు ఉపయోగించాలని చెబుతున్నారు. వాటిలో గరిక (దూర్వా) ప్రత్యేక ప్రాముఖ్యం కలిగిందని.. పురాణాల ప్రకారం గరికతో గణనాథుడిని పూజిస్తే అధిక పుణ్యం లభిస్తుందని చెబుతాయి.
గణపతి పూజలో ఉండే 21 రకాల పత్రులు..
1. మాచీపత్రం - చేమంతి ఆకుల మాదిరిగా ఉంటాయి.
2. బృహతీపత్రం - వంగ ఆకుల మాదిరిగా, తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి.
3. బిల్వపత్రం - బిల్వపత్రం అంటే మారేడు ఆకు.
4. దూర్వాపత్రం - దూర్వా పత్రం అంటే గరిక.
5. దత్తూర పత్రం - ఉమ్మెత్త ఆకులు.
6. బదరీపత్రం - రేగు ఆకులు.
7. అపామార్గపత్రం - దీనినే ఉత్తరేణి అంటారు.
8. తులసీపత్రం - సాధారణంగా అందరికీ తెలిసిన తులసి ఆకులు.
9. చూతపత్రం - మామిడాకులు.
10. కరవీరపత్రం - గన్నేరు ఆకులు.
11. విష్ణుక్రాంత పత్రం - వీటినే శంఖు పూలు అంటారు.
12. దాడిమీ పత్రం - దానిమ్మ చెట్టు ఆకులు.
13. దేవదారు పత్రం - ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది.
14. మరువక పత్రం - మరువం సువాసనలతో ఉండే ఆకులు.
15. సింధూరవార పత్రం - వాడుకలో వావలి అంటారు.
16. జాజి పత్రం - సన్నజాజి లేదా మల్లెజాతి మొక్క ఆకులు.
17. గండకీ పత్రం - వీటిని లతాదూర్వా అంటారు. ఇస్తారాకులు తయారుచేసేందుకు వాడుతుంటారు.
18. శమీ పత్రం - జమ్మి చెట్టు ఆకులు.
19. అశ్వత్థ పత్రం - రావి ఆకులు.
20. అర్జునపత్రం - దీనినే మద్ది పత్రం అంటారు.
21. అర్క పత్రం - జిల్లేడు ఆకులు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications