దీపావళి నుంచి వీరికి లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహం
ఈ ఏడాది ధన త్రయోదశి రేపు (శుక్రవారం) రాబోతోంది. ఆరోజు కుబేరుడితోపాటు లక్ష్మీదేవిని పూజించడం సాంప్రదాయం. ధన త్రయోదశిరోజు శుభ యోగం ఏర్పడనుంది. దాదాపు 400 సంవత్సరాల తర్వాత ధనత్రయోదశి పుష్య నక్షత్రం, శని పుష్య యోగంలో వచ్చింది. పుష్య నక్షత్రం ఉదయం 7:57 నుంచి 10:29 వరకు ఉంటుంది. శని పుష్య యోగం ఉదయం 7:57 నుంచి రాత్రి వరకు ఉంటుంది. ఈ మంచి సమయాల్లో కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశివారికి లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

కర్కాటక రాశి
పండగరోజు ఏర్పడే ఈ ప్రత్యేక యోగం వల్ల గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. పెట్టుబడులు పెట్టేవారికి అనేక లాభాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నీ విజయవంతమవుతాయి.
కన్యారాశి
ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారాలు, వృత్తి జీవితాల్లో కొనసాగుతున్నవారి ఆదాయం రెట్టింపవుతుంది.
మకర రాశి
శుభవార్తలు వింటారు. ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. జీవితంలో గతంలో ఎన్నడూ పొందనటువంటి సంతోషాన్ని పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఊహించని రీతిలో లాభాలను పొందుతారు.












Click it and Unblock the Notifications