హోలీ రోజు చంద్ర గ్రహణం.. ఈ రాశులకు కుబేరుడి అనుగ్రహం
చంద్ర గ్రహణమైనా, సూర్య గ్రహణమైనా ప్రజలు చాలావరకు వాటిని అశుభాలని భావిస్తుంటారు. ఈ సంవత్సరం తొలి చంద్ర గ్రహణం మార్చి 25 హోలీ పర్వదినం రోజు ఏర్పడబోతోంది. హోలీకి ముందురోజు హోలికా దహనం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల మధ్య చంద్ర గ్రహణం ఏర్పడటం మంచిది కాదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. గ్రహణం ఎంత సమయం ఉంటుంది? ఎక్కడెక్కడ కనిపిస్తుందనే విషయాలను తెలుసుకుందాం.
గ్రహణ సమయం
తొలి చంద్రగ్రహణం మార్చి 25, సోమవారం ఏర్పడుతోంది. ఉదయం 10.23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.20 గంటల వరకు కొనసాగుతుంది.

గ్రహణం ప్రభావం
ఇది ఇండియాలో కనిపించదు కాబట్టి మన దేశంపై ప్రభావం చూపదు. అలాగే సూతక్ కాలం కూడా చెల్లుబాటు కాదు. కాబట్టి హోలీని సంతోషంగా జరుపుకోవచ్చు.
గ్రహణం ఎక్కడ కనిపిస్తుందంటే?
స్విట్జర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, అమెరికా, జపాన్, రష్యా, ఐర్లాండ్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, హాలండ్, బెల్జియం, సౌత్ నార్వే లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
రాశులపై ప్రభావం
అన్ని రాశులవారిని ప్రభావితం చేయబోతున్నప్పటికీ జ్యోతిష్యం ప్రకారం ఎక్కువగా ధనుస్సు, సింహం, మిథునం, మకర రాశులవారికి మంచి ప్రయోజనాలుంటాయి. ఈ సమయంలో వీరికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ సమయంలో పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు. ఆర్థికంగా స్థిరపడటానికి పలు అవకాశాలు తలుపు తడతాయని, వాటిని ఉపయోగించుకోవాలని, ఉన్న అవకాశాలపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా ఈ రాశులన్నింటికీ కలిసి రానుందని, వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుందని, పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు.












Click it and Unblock the Notifications