చంద్ర గ్రహణం రోజు ఇలా చేయండి.. సంపద వర్షంలా కురుస్తుంది
ఈ ఏడాది రెండు చంద్ర గ్రహణాలు, రెండు సూర్య గ్రహణాలు సంభవించనున్నాయి. తొలి చంద్ర గ్రహణం వచ్చే నెల 25న ఫాల్గుణ పూర్ణిమ రోజు, దీనితర్వాత 15 రోజుకు తొలి సూర్య గ్రహణం సంభవిస్తుంది. చంద్ర గ్రహణానికి 9 గంటలు ముందుగా సూతక్ కాలం ప్రారంభమవుతుంది. గ్రహణంవల్ల సంభవించే అశుభాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను తెలుసుకుందాం.
తులసి ఆకులను ఆహారం తీసుకోవడానికి ముందు, పానీయాలు తీసుకోవడానికి ముందు ఉపయోగించాలి. దీనివల్ల గ్రహణంతో సంభవించే అశుభాలు ఆయా వస్తువులపై పడవు. తులసితోపాటు ఒక ఆకు కూడా ఉంది. అదే దూర్వా గడ్డి. జ్యోతిష్యంలో దూర్వా గడ్డి చాలా పవిత్రమైనది. దీనిని పూజలు, శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. ఈ గడ్డి గురించి పురాణాల్లో కూడా చెప్పారు. గ్రహణ సమయంలో దుర్వాగడ్డిన ఉపయోగించడంవల్ల అశుభ ప్రభావాల నుంచి బయటపడతారు.

నువ్వులు
ప్రతికూల శక్తులన్నీ గ్రహణ సమయంలో మేల్కొంటాయి. వాటి దుష్ఫలితాలను నివారించడానికి ఆ సమయంలో దానధర్మాలు చేస్తే చాలా మంచిది. వీటిని ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు. నువ్వులను దానం చేయడంవల్ల రాహువు, కేతువు బాధల నుంచి బయటపడతారు.
గంగాజలం
గంగాజలం ఎంతో పవిత్రమైనది. గ్రహణ సమయంలో గంగాజలంతో స్నానం చేస్తే దుష్ప్రభావాల నుంచి బయటపడతారు. గంగను తల్లిగా భావిస్తారు. చాలామంది ఇళ్లల్లో పవిత్రమైన నదీ జలాలు ఉంటాయి. గ్రహణ సమయంలో వీటిని తాకకుండా ఉండటం మంచిది. గ్రహణ సమయం ముగిసిన తర్వాత పవిత్రమైన ఈ జలంతో స్నానం చేయడంవల్ల ప్రతికూల శక్తులు నశిస్తాయి.












Click it and Unblock the Notifications