2025లో ఈ రాశులపై కుంభవృష్టి... జరగకపోతే జ్యోతిష్యం మానేస్తానన్న నీరజ్
ఈనెల 7వ తేదీ నుంచి అంగారకుడు తిరోగమన దిశలో సంచరిస్తున్నాడు. తర్వాత జనవరిలో మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. అనంతరం ఏప్రిల్ రెండోతేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ పరిణామాలన్నీ కొన్ని రాశులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు నీరజ్ ధన్ ఖేర్ చెబుతున్నారు. దీనివల్ల కెరీర్ పరంగా అభివృద్ధి చెందడంతోపాటు జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఆర్థికంగా బాగా కలిసివస్తుందని చెబుతున్నారు. ఏయే రాశులవారికి ఏవిధంగా ఆయన చెప్పిన ప్రకారం కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
తులా రాశి
గతంలో మొదలై ఆగిపోయిన పనులన్నీ పూర్తవడానికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రాజెక్టులు పూర్తిచేయడానికి వ్యూహాలను అమలు చేయాలి. పనుల్లో జరుగుతున్న ఆలస్యంవల్ల చికాకులు ఎదురవుతుంటాయికానీ వాటిని అధిగమించాలి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. అందుకు మీరు చేసే పనులే కారణం.

వృశ్చికం
లక్ష్యాలపై దృష్టిపెట్టండి. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో అంగారకుడు మీకు అద్భుత అవకాశాలను కల్పిస్తున్నాడు. వచ్చినవాటిని ఉపయోగించుకోవాలి. కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రయాణాలవల్ల ఇబ్బందులు పడతారు.
ధనుస్సు
చేసే పనులపై స్వీయ అవగాహన పెంచుకోవాలి. సవాళ్లను ఎదుర్కోవడంపై దృష్టిసారించాలి. జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి. అవి చాలా బాగా కలిసివచ్చేవిధంగా ఉంటాయి. ఆర్థిక సంబంధాలు బాగుంటాయి. మానవ సంబంధాలను పెంపొందించుకోవాలి. నెమ్మదిగా ఎదుగుతూ వస్తుంటారు.
మకర రాశి
వ్యాపారస్తులు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంతోపాటు కొత్త భాగస్వాములను వెతకాల్సి ఉంటుంది. ఇది చాలా కీలకం. మంచి ఫలితాలనిస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారాల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, మానవ సంబంధ విషయాలను సమానంగా చూస్తుండాలి. రెండింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
కుంభం
నెమ్మదిగా జరుగుతున్న పనులపై దృష్టిపెట్టాలి. వాటిని మెరుగుపరిచి పరుగులెత్తించాలి. ఎవరు ఏవిధంగా చేస్తే పనులు పూర్తవుతాయనే విషయాన్ని గమనంలోకి తీసుకొని వారికి బాధ్యతలు కేటాయించాలి. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. లాభాలుంటాయి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కూడా ప్రాధాన్యతనివ్వాలి. మంచి ఆరోగ్యంగా ఉండటానికి తగిన అలవాట్లు అలవరుచుకోవాల్సి ఉంటుంది.
మీనం
పిల్లలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. లక్ష్యాన్ని సాధించేందుకు తీవ్ర ఒత్తిడికి గురవ్వాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు కారణాలను అన్వేషించాలి. జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవితంలో ట్రెండీగా అనిపించేవాటిని అనుసరించొద్దు. మీరు ఇష్టపడేవాటిపైనే దృష్టిపెట్టండి.
ఈ రాశులతోపాటు మేష రాశి, వృషభరాశి, మిథునరాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశివారి జీవితాలు కూడా కొత్త సంవత్సరంలో బాగుంటాయని పండిట్ నీరజ్ ధన్ ఖేర్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications