మకర రాశిలో అద్భుత యోగం.. ఈ రాశులకు మహర్ధశ

జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికలు అన్ని రాశులవారిపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులవారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. ఈరోజు రాత్రి 9.00 గంటలకు కుజుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. 12వ తేదీన శుక్రుడు కూడా ఇదేరాశిలోకి సంచారం చేస్తారు. కుజుడు, శుక్రుడి కలయికవల్ల ధనశక్తి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఏయే రాశులవారికి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి: ధనశక్తి రాజయోగం వీరికి బాగా కలిసివస్తుంది. కెరీర్ లో మంచి స్థానానికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలను ఆర్జిస్తారు. పిల్లలు లేనివారికి సంతాన యోగం ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు తిరిగి పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

3 zodiac sign people are very lucky becuse of Mars transit in Capricorn 2024

ధనస్సు రాశి: ఈ రాశివారు పట్టుకుందల్లా బంగారమే అవుతుంది. కెరీర్ లో మంచి పురోగతి ఉంది. దేనికీ లోటుండదు. ఆర్థికంగా లాభాలున్నాయి. చేపట్టే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. గతం నుంచి వేధిస్తున్న దరిద్రం నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

వృషభరాశి: ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. చేసే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. సమస్యల నుంచి బయటపడటంతోపాటు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిస విహార యాత్రకు లేదంటే ఆధ్యాత్మిక పరమైన యాత్రలకు ఆసక్తి చూపిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+