వ్యాపారంలో నష్టాలా? ఈ 7 వాస్తు చిట్కాలు పాటిస్తే.. డబ్బే డబ్బు

కష్టపడి పనిచేస్తున్నా ఫలితం ఉండట్లేదా? ఎంత సంపాదించినా అప్పులు తీరడం లేదా? వ్యాపారంలో ఎదుగుదల లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారా? అయితే మీ వ్యాపార స్థలంలో వాస్తు దోషం ఉండే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. పంచభూతాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతాయి.

మీ వ్యాపారాన్ని మళ్ళీ లాభాల బాట పట్టించే అద్భుతమైన 7 వాస్తు చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

1. కుబేర స్థానం
ఉత్తర దిక్కు సాక్షాత్తూ కుబేరుడికి నిలయం. అందుకే ఈ దిశ ఎప్పుడూ ఖాళీగా, ప్రశాంతంగా ఉండాలి.ఇక్కడ అగ్ని సంబంధిత వస్తువులు (నూనె, నెయ్యి, కర్పూరం, అగర్​బత్తీలు) ఉంచకూడదు. ఎరుపు రంగు వస్తువులు లేదా ఎరుపు రంగు పెయింటింగ్ వేయవద్దు.ఇక్కడ ఆకుపచ్చని వస్తువులు ఉంచండి. వ్యాపార కారకుడైన బుధ గ్రహానికి ఆకుపచ్చ అంటే చాలా ఇష్టం. ఇది వ్యాపార లాభాలను రెట్టింపు చేస్తుంది.

7 Powerful Vastu Tips for Business Success Attract Customers and Wealth Instantly

2. నరఘోషకు చెక్ పెట్టే 'యంత్రాలు'
కొన్నిసార్లు నరఘోష వల్ల బాగా సాగుతున్న వ్యాపారం ఒక్కసారిగా కుదేలవుతుంది. రావాల్సిన బకాయిలు ఆగిపోతాయి. అటువంటప్పుడు షాపులో దేవుడి పటాల వద్ద నరఘోష యంత్రం, ఆకర్షణ యంత్రాన్ని ప్రతిష్టించండి. ఉదయం, సాయంత్రం ధూపం (అగర్​బత్తీలు) వేయడం వల్ల దుష్టశక్తులు తొలగిపోతాయి.

3. దేవుడి పటాలు ఎక్కడ ఉండాలి?
దేవుడి విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ ఉంచితే ప్రతికూల ప్రభావం ఉంటుంది. వాస్తు ప్రకారం వ్యాపార సంస్థల్లో దేవుడి పటాలు ఎల్లప్పుడూ ఈశాన్యం లేదా తూర్పు దిశలోనే ఉండాలి.

4. సింహ ద్వారం
దుకాణం ప్రవేశ ద్వారం వద్ద రకరకాల అలంకరణ వస్తువులతో అడ్డుగా ఉంచకూడదు. ఇది లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటుంది. ప్రధాన ద్వారం వాయువ్యం, ఈశాన్యం లేదా ఉత్తర దిక్కుల్లో ఉండటం శుభకరం. అలాగే, మీ క్యాష్ కౌంటర్ ఎల్లప్పుడూ ఉత్తర దిక్కులో ఉండేలా చూసుకోండి.

5. గోడల రంగులు
మీ షాపులోని రంగులు కస్టమర్ల మూడ్‌ని ప్రభావితం చేస్తాయి. డార్క్ కలర్స్ కాకుండా.. తెలుపు, నీలం, క్రీమ్ లేదా లేత బూడిద రంగులను ఎంచుకోండి. ఇవి ప్రశాంతతను ఇచ్చి, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి.

6. యజమాని కూర్చునే దిశే విజయం
షాప్ ఓనర్ ఎప్పుడూ నైరుతి దిశలో కూర్చోవాలి. కూర్చున్నప్పుడు మీ ముఖం ఉత్తరం వైపు ఉండాలి. మీ సీటు వెనుక దేవుడి పటాలు ఉండకూడదు. మీ వెనుక ఎప్పుడూ సాదా గోడ ఉండేలా చూసుకోండి, ఇది మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది.

7. గణపతి & మెటల్ తాబేలు
షాపులో శ్వేతార్క గణపతి ఫోటోను ఉంచి, వారానికి ఒకసారి కొబ్బరికాయ కొట్టి, పసుపు రంగు స్వీట్లను నైవేద్యంగా పెట్టి వర్కర్లకు పంచండి. మీ టేబుల్‌పై లోహంతో చేసిన తాబేలును ఉంచండి. ఇది కస్టమర్లను ఆకర్షించడమే కాకుండా, మొండి బకాయిలు త్వరగా వసూలు కావడానికి దోహదపడుతుంది.

వాస్తు అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, అదొక శాస్త్రం. ఈ చిన్న చిన్న మార్పులు మీ వ్యాపారంలో గొప్ప మార్పును తీసుకొస్తాయి. స్వచ్ఛమైన మనసుతో, నమ్మకంతో వీటిని పాటించి చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+