ఈ విషయాలను ఎప్పుడూ రహస్యంగానే ఉంచాలి
ఆచార్య చాణక్యుడు తన జ్ఞానం, బోధనలు, నైతికతతో మంచి పేరు తెచ్చుకున్నారు. చాణక్యుడి సూత్రాలను పాటించడం ద్వారా విజయవంతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది. డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం మొదలైన అనేక అంశాలపై అనేక ఆలోచనలను చాణక్యుడు వివరంగా తెలియజేశాడు. ఆరోజుల్లో ఆయన చెప్పిన విషయాలు ఎన్ని తరాలు మారినా ఇప్పటికీ వర్తిస్తుండటం విశేషం. ఒక వ్యక్తి తన జీవితంలో కొన్ని ఆలోచనలను ఇతరులతో పంచుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. ఆ ఆలోచనలు ఏమిటో తెలుసుకుందాం.
వయస్సు గురించి : ఒక వ్యక్తి తన వయసు గురించి ఎవరికీ చెప్పకూడదు. ఈ విషయాన్ని ఎప్పుడూ రహస్యంగానే ఉంచాలి. వయసు తెలిస్తే శత్రువులు సానుకూలంగా మార్చుకుంటారు.

విరాళం వివరాలు : గురువు ఒక వ్యక్తికి ఏదైనా ప్రత్యేక మంత్రం లేదా జ్ఞానాన్ని బోధిస్తే, అతను దానిని ఎవరితో పంచుకోకూడదు. దానధర్మం చేయడం పుణ్య కార్యంగా పరిగణిస్తారు. ఇతరుల ఎదుట దానానికి సంబంధించిన వివరాలు ఎట్టి పరిస్థితుల్లోను చెప్పకూడదు. ఒకవేళ వాటిని వెల్లడిస్తే ఎటువంటి పుణ్యాన్ని పొందలేరు.
వైవాహిక జీవితం గురించి :వైవాహిక జీవితంలో అనేక అంశాలుంటాయి. వాటిని రహస్యంగానే ఉంచాలి. మూడో వ్యక్తితో పంచుకుంటే ఇద్దరికీ నష్టం జరుగుతుంది. మీ వైవాహిక జీవితం గురించి అనేకమంది పరాచికాలడతారు. అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఎవరికీ చెప్పకుండా ఉండటమే ఉత్తమం.
సంపద గురించి : వ్యక్తి తన సంపద గురించి ఎవరికీ చెప్పకూడదు. ఆదాయ విషయాలను గోప్యంగా ఉంచాలి. అవి తెలిస్తే ప్రజలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంటుంది.
ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను మనం ఎప్పుడూ రహస్యంగానే ఉంచాలి. అలా చేయలేకపోతే మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. దానివల్ల మీకు కోపం కలిగి అసంతృప్తికి దారితీస్తుంది.












Click it and Unblock the Notifications