వాస్తు ప్రకారం ఇంట్లో గోడలకు బూజు ఉందేమో ఒకసారి చూడండి.. అప్పుడు!!
ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకున్నా, ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. వాటిని పరిష్కరించడానికి కొంతమంది ఇంటి వాస్తులో మార్పుచేర్పులు చేస్తుంటారు. కొంతమందికి పేర్లలో కూడా దోషం ఉంటుంది. ఇలా దోషాలన్నీ కలిసి అప్పుల సమస్యను ఏర్పరుస్తాయి. వాస్తు పరంగా వీటిని అధిగమించడానికి ఏంచేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి గోడులు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి.
గోడకు మూలన సాలెపురుగులు ఉండకూడదు
అవి గూళ్లు కట్టకుండా చూసుకోవాలి.
మూడు వారాలకోసారి బూజు దులపాలి.
ఇలా చేస్తే ఇంట్లోకి ధన ప్రవాహం ఉంటుంది.

సాయంత్రం సమయంలో నిద్ర పోకూడదు.
దీనివల్ల ఇంట్లోకి పేదరికం వస్తుంది.
సాయంత్రం సమయంలో పూజలు చేయాలి.
అప్పుడు ఆ పూజల వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
ఇంట్లో టాయిలెట్ నైరుతి దిశలో ఉంటే డబ్బు ఖర్చవుతుంది.
మీకు తెలియకుండానే మాయమవుతుంది.
నైరుతి దిక్కులో టాయిలెట్ లేకుండా చూసుకోండి.
ఇల్లు, దుకాణం.. ఏదైనా సరే గాజు కిటికీని ఈశాన్యంలో పెట్టండి.
అప్పుల బాధ నుంచి బయటపడతారు.
ఇల్లు బరువుగా ఉండకూడదు.
ఉత్తరం, ఈశాన్యంలో బరువులు పెట్టొద్దు.
సాయంత్రం సమయంలో మొక్కలు, చెట్లు నరకొద్దు.
సాయంత్రం సమయం అవి విశ్రాంతి తీసుకుంటుంటాయి.
సాయంత్రం సమయంలో చెట్లు, మొక్కల జోలికి పోకూడదు.
సాయంత్రం సమయంలో ఆకులు తెంపినా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతారు.
డబ్బు దాచే బీరువా, లాకర్ ఉత్తరంవైపు ఉండాలి.
దీనివల్ల రుణాలు తీరిపోతాయి.
సోమవారం, బుధవారాల్లో డబ్బు వ్యవహారాలు నడపాలి.
అయితే ఈ రెండురోజుల్లో అప్పు చేయవద్దు.
ఇలా చేస్తే అప్పులు పెరుగుతూనే ఉంటాయి.












Click it and Unblock the Notifications