వాస్తు ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు అసలు ఉండకూడదు
వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండకూడదు. అవి ఉంటే ఆర్థికంగా నష్టపోవడంతోపాటు తీవ్ర ఇక్కట్లకు గురికావల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం ప్రవేశించింది. అందరూ ఇంటిని శభ్రం చేసుకుంటారు. చెత్తా చెదారం మొత్తం బయట పారేస్తారు. అలాగే కొన్నిరకాల వస్తువులను కూడా తీసేస్తే కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. కొత్త సంవత్సరంలో వారు సూచించిన పనులు చేసి ప్రతికూల శక్తిని పారద్రోలి అందరూ సంతోషంగా ఉండాలి.
విరిగిపోయిన గడియారాలు, పనిచేయని గడియారాలు ఉండకూడదు
వీటివల్ల కుటుంబంలో వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది.
గొడవలు జరుగుతాయి. ప్రశాంతతను కోల్పోతారు.

పగిలిపోయిన గాజు వస్తువులను తొలగించండి.
అద్దాలు పగిలిపోతే వెంటనే బయట పడేయండి.
పగిలిన గాజు వస్తువులు కుటుంబంలోకి పేదరికాన్ని తెస్తాయి.
వ్యర్థ పదార్థాలు, విరిగిపోయిన వస్తువులుంటే బయట పారేయండి.
వీటివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది.
ఇంట్లో ఎండిపోయిన చెట్లు ఉండకూడదు.
అలాగే చెడ్డ చెట్లు, కుళ్లిపోయినవి అసలు ఉండకూడదు.
పగిలిపోయిన డబ్బాలు, విరిగిపోయిన మొక్కలు, పొడి, చెడు మొక్కలు తొలగించాలి.
వీటివల్ల వ్యతిరేక శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
చిరిగిపోయిన పాత బట్టలు పారయండి.
ఇష్టం లేకపోతే పేదలకు దానమివ్వండి.
అలాగే బెడ్ షీట్లు, దుప్పట్లు కూడా తీసేయాలి.
ఇలా చేయకపోతే ఇంట్లోకి పేదరికం వస్తుంది.












Click it and Unblock the Notifications