వాస్తు ప్రకారం బెడ్ రూంలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి!
వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటాం. అందులో ప్రతి అంగుళం కూడా వాస్తు ప్రకారమే ఉండేలా దగ్గరుండి కట్టించుకుంటాం. ఏమాత్రం తేడా వచ్చినా ఆర్థిక ఇబ్బందులతోపాటు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రధానంగా అందరూ చేసే తప్పు ఏమిటంటే బెడ్ రూంలో ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు పెడుతుంటారు. కానీ అలా చేయకూడదు. వాస్తు ప్రకారం బెడ్ రూంలోకి సానుకూల శక్తి ప్రవేశించాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. అవేమిటనేది తెలుసుకుందాం.
కత్తులు, పట్కార్లు, కత్తెర, బ్లేడ్లు లాంటి పదునైన వస్తువులు ఉండకూడదు.
భార్యాభర్తల మధ్య సంబంధాలు, అనుబంధాలు దెబ్బతింటాయి.
ఉంటేకనుక వాటిని వెంటనే తొలగించాలి.

ఏడుస్తున్న ఫొటోలు, రక్తపాతానికి సంబంధించిన ఫొటోలు ఉండకూడదు
మానసిక ఒత్తిడిని పెంచి నిద్ర పట్టకుండా చేస్తాయి.
పూజగదిలో ఉండాల్సిన పూజా సామాన్లను ఉంచకూడదు.
దీనివల్ల ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు.
అది చాలా పెద్ద తప్పు.
ఎందుకంటే అద్దం ప్రతికూల శక్తిని తెస్తుంది.
మానసిక ఒత్తిడిని పెంచి నిద్రలేమి కలిగిస్తుంది.
ఒకవేళ అద్దం ఉన్న రాత్రివేళ గుడ్డతో కప్పేయండి.
ఎలక్ట్రానిక్ వస్తువులుంటే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ విడుదలవుతాయి.
ప్రతికూల శక్తిని కలిగించి సానుకూల శక్తిని తరిమికొడతాయి.
నిద్ర పోవడానికి గంట ముందే వాటిని ఆపేయాలి.
పాత సామాన్లు, విరిగిపోయిన వస్తువులు, చెత్త ఉంకూడదు.
జీవితంలో అడ్డంకులనేవి వీటివల్లే కలుగుతంటాయి.
బెడ్ రూంను శుభ్రంగా ఉంచుకోవాలి.












Click it and Unblock the Notifications