వాస్తు ప్రకారం ఇంటిముందు ఈ మొక్కలు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి!

కాలం మారుతున్న కొద్దీ మన భారతీయ పురాతన శాస్త్రమైన వాస్తు శాస్త్రానికి ఆదరణ పెరుగుతుందేకానీ తగ్గడంలేదు. అంత శక్తివంతంగా పండితులు దాన్ని రూపొందించి మనకు అందించారు. ఎన్ని యుగాలు మారినా, కాలాలు మారినా, తరాలు మారినా వాస్తు శాస్త్రం మాత్రం మారదు. అన్ని సమయాల్లోను అది ఒకేలా ఉంటుంది. ఆ వాస్తు ప్రకారం చూసుకుంటే ఇంటిముందు కొన్ని మొక్కలు ఉండకూడదు. అవి ఉంటే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని, దురదృష్టం కలుగుతుందని, కుటుంబంలో విభేదాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఏ మొక్కలు ఇంటి ముందు ఉండకూడదో తెలుసుకుందాం.

ఎండిపోయిన మొక్కలు
వాస్తు ప్రకారం మరణించిన, ఎండిపోయిన మొక్కలు ఉండకూడదు. వాటిని అలాగే ఉంచితే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. వెంటనే వాటిని తొలగించి పచ్చని మొక్కలను తీసుకొచ్చి నాటాలి.

According to Vastu these plants should not be in front of the house Take a look

గోరింటాకు మొక్క
వాస్తు ప్రకారం ఇంట్లో గోరింటాకు మొక్క నాటకూడదు. దీనివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. పాజిటివ్ ఎనర్జీ క్రమేపీ తగ్గుతూ వచ్చి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తుంది.

కాక్టస్
ఇలాంటి ముళ్ల మొక్కలు పెంచకూడదు. అందం కోసం కాక్టస్, హవోర్న్, నిమ్మలాంటి ముళ్ల చెట్లను నాటతారు. అయితే ఇవి ప్రతికూల శక్తి ప్రసరింపచేస్తాయి. ప్రశాంతత లేకుండా చేస్తాయి. కుటుంబ పరంగా ఇబ్బందులను కలిగిస్తాయి.

రావిచెట్టు
ఇంట్లో రావిచెట్టు ఉండకూడదు. దీన్ని హిందూ మతం ప్రకారం దేవాలయాల్లో నాటతారు. అక్కడే పూజిస్తారు. పొరపాటున ఇది ఇంట్లో పెరిగితే దాన్ని ఎంతో జాగ్రత్తగా తొలగించి అత్యంత పవిత్ర ప్రదేశంలో లేదంటే సమీపంలోని ఆలయంలో నాటాలి. లేదంటే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.

బోన్సాయ్ మొక్క
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇంట్లో బోన్సాయ్ మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్క కుటుంబ సభ్యుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రతికూల శక్తిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. అనేక అడ్డంకులకు కూడా కారణమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+