వాస్తు ప్రకారం ఆస్తులు పోకుండా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు

వాస్తు ప్రకారం నియమాలను అనుసరించి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటారు. అయితే ఎక్కడో ఒకచోట ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమించాలంటే వాస్తు నిపుణుల సలహాలను తీసుకొని పాటిస్తుండాలి. వాస్తుదేముందిలే అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు. ఎందుకంటే అది మన పూర్వీకులు అందించిన అద్భుతమైన శాస్త్రం. పురాణాల్లో కూడా ఉంటుంది. వాస్తు ప్రకారం మనం సంపదను పోగొట్టుకోకుండా, ఆస్తులను నిలబెట్టుకోవడానికి ఏం చేయాలనే వివరాలను తెలుసుకుందాం.

ఉత్తర దిశలో పాత వస్తువులు, చెత్త, మరుగుదొడ్లు, చెప్పులు ఉండకూడదు.
ఉత్తర దిక్కు శుభ్రంగా ఉంటే ధనాకర్షణ పెరుగుతుంది.
కుబేరుడి అనుగ్రహం కోసం ఈ దిశలో ఆకుపచ్చ రంగు వాడాలి.

According to Vastu to avoid losing assets just do these small things

డబ్బులు నిల్వ చేసే పెట్టెను ఉత్తరంవైపు గోడకు ఆనించాలి.
లాకర్ తలుపు ఉత్తరం వైపునకు తెరవాలి.

ఈశాన్యం తేలికగా ఉండాలి. ఆ దిక్కులో బరువు ఉండకూడదు.
అలా ఉంటే సంపదను అడ్డుకుంటుంది.
ఈశాన్యంలో టాయ్ లెట్ ఉండకూడదు.
నైరుతి దిశ ఆర్థికంగా స్థిరత్వాన్ని కల్పిస్తుంది.
మనుషులతో దీర్ఘకాలిక సంబంధాలను కలిగిస్తుంది.

ప్రధానంగా బాత్ రూం విషయంలో వాస్తును అనుసరించాలి.
అన్నింటికంటే ఎక్కువ ప్రతికూల శక్తి బాత్ రూంలోనే ఉంటుంది.
ప్రతికూల శక్తి ఉంటే ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి.
బకెట్ ను ఖాళీగా ఉంచకూడదు. లేదంటే బోర్లించాలి.

ఇంట్లో నీటి లీకేజీలు ఉండకూడదు.
ఈశాన్యంలో అక్వేరియం లేదంటే చిన్న ఫౌంటెన్ ఉంటే మంచిది.
యజమాని పడక గది నైరుతిలో ఉండాలి.

ఇంటి మధ్యలో ఖాళీగా ఉండాలి. బరువు ఉండకూడదు.
మెట్లు, టాయ్ లెట్లు ఉండకూడదు.
అలా ఉంటే డబ్బు నష్టం కలుగుతుంది.

వంటగదిలో ధాన్యాన్ని నిల్వ చేసే డబ్బాలు నైరుతి దిక్కులో ఉండాలి.
విరిగిన అద్దాలు, పగిలిన వస్తువులు, పాడుబడిన గడియారాలు ఉండకూడదు.
ఇవి ఆర్థిక నష్టాలను కలుగజేస్తాయి.
రాత్రివేళ ఇంటి ప్రధాన తలుపు వద్ద చెత్త, పాత వస్తువులు ఉంచొద్దు.
సింహద్వారం నుంచి లోపలికి వచ్చేటప్పుడు అడ్డుగా ఏవీ ఉండకూడదు.
వీటిని పాటిస్తే సంపద నిలుస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+