వాస్తు ప్రకారం ఇంటికి, ఇంట్లోని గదులకు తలుపులు ఎటువైపు ఉండాలి?

ఇంటి నిర్మాణం వాస్తుతో కూడుకొని ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా వాస్తును అనుసరిస్తూ నిర్మాణం చేయిస్తారు. అయినప్పటికీ ఎక్కడో ఒకచోట తప్పులు జరగడం, వాటివల్ల ఇబ్బందులు తలెత్తడం అనేవి జరుగుతుంటాయి. ఈరోజుల్లో చాలామంది వాస్తును అనుసరించకుండానే కట్టేస్తున్నారు. వాస్తు ప్రకారం బెడ్ రూం తలుపులు ఎటువైపు ఉండాలనే విషయంలో చాలామందికి అవగాహన లేదు.

హాల్ కు తలుపులు ఉత్తరం వైపు ఉండాలి
ప్రతి గదికి తలుపులు అవసరమవుతాయి. అవి మనిషి రాకపోకలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. ఉత్తరం-ఈశాన్యం దిక్కులో గది తలుపు లోపలికి వెళుతుంటే ఎడమైపు ఉండాలి. దక్షిణం-ఆగ్నేయంలో గది తలుపులు కుడివైపు ఉండాలి. అంటే మనకున్న గది వైశాల్యాన్ని బట్టి ఉంటుంది. ఒకటే తలుపు పెట్టుకోవాలనుకున్నవారికి సంబంధించిన విషయం ఇది. గదికి రెండు తలుపులు పెడుతున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది తలెత్తదు. ఎందుకంటే ఎక్కడివి అక్కడే అమరి ఉంటాయి. హాల్ కు రెండు తలుపులు ఉండాలి. అవి కూడా ఉత్తరంవైపు ఉండాలి.

According to Vastu which side should the doors of the house and the rooms in the house face

డ్రైనేజీ రానిచోట సెప్టిక్ ట్యాంక్
తూర్పు దిక్కుకు మధ్యలో లేదంటే ఉత్తరం దిక్కుకు మధ్యలో సెప్టిక్‌ ట్యాంక్‌ అనేది డ్రైనేజీ రానిచోట పెట్టాలి. ఇంట్లో ఎలాపడితే అలా గోతులు తవ్వలొద్దు. చాలామంది ఇంటికి వాయువ్యం-ఆగ్నేయం దిశలో సెప్టిక్ ట్యాంకు కడుతుంటారు. కానీ వాటివల్ల రోగాలు వస్తాయి. ఒకవేళ రెండు సెప్టిక్ ట్యాంకులు కావాలనుకున్నవారు ఒకే ప్రదేశంలో వీటిని నిర్మించుకోవాలి. రెండు కట్టుకోవచ్చుకానీ మన అవసరాలకు సరిపడా ప్రదేశం ఉండదు. ఎందుకంటే బోరు, నీటి సంపు ప్రతి ఇంటిలో ఉంటాయి. వాటి వల్ల స్థలం సరిపోదు. తూర్పు వైపు గోడ బయట కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+