ఎల్లుండి మేష సంక్రాంతి.. ఇవి దానం చేయండి!
ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3:12 గంటలకు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనినే మేష సంక్రాంతి అని పిలుస్తారు. అదేరోజు మూడు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. వాటిని సిద్ధ యోగం, సధ్య యోగం, సర్వార్థ సిద్ధియోగం అని అంటారు. ఆ రోజు నదిలో స్నానం చేయడంతోపాటు దానం చేయడం కూడా మంచిది. దీనివల్ల సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. ఉదయం 10.55 గంటల నుంచి సాయంత్రం 6.46 గంటల వరకు స్నాన దానానికి శుభ ముహూర్తాలున్నాయి. అదే రోజు పూర్వీకులకు తర్పణాలు వదలడం చాలా మంచిది. ఏ రాశికి సంబంధించినవారు రాశులవారీగా దానం చేయడంవల్ల ప్రతి మనిషి జాతకంలోని 9 గ్రహాలు బలపడతాయి.
దానం చేయాల్సిన వస్తువులు రాశులవారీగా..

1. మేషరాశి: ఈ రాశి వారు మేష సంక్రాంతి రోజు ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పూలు, పప్పు దానం చేయాలి.
2. వృషభరాశి: ఈ రాశివారు పాలు, పెరుగు, తెల్లని పువ్వులు, తెల్లటి వస్త్రాలు దానం చేయాలి.
3. మిథునరాశి: పచ్చని వస్త్రాలు, పచ్చి పండ్లు, పచ్చి కూరగాయలు దానంగా ఇవ్వాలి.
4. కర్కాటక రాశి: తెల్లటి వస్తువులు చక్కెర, బటాషా, తెల్ల చందనం మొదలైనవి దానంగా ఇవ్వాలి.
5. సింహరాశి: సూర్య భగవానుడికి సంబంధించిన వస్తువులు దానమివ్వాలి. నారింజ, ఎరుపు గుడ్డ, గోధుమలు, ఎర్ర చందనం, పసుపు పువ్వులు మొదలైనవి.
6. కన్యారాశి: పచ్చని వస్తువులు దానమివ్వడంవల్ల బుధ గ్రహాన్ని బలపరుస్తుంది.

8. వృశ్చిక రాశి: ఈ రాశివారు ఎరుపు రంగు వస్తువులను దానంగా ఇవ్వాలి. ఈ రాశికి అధిపతి కుజుడు.
9. ధనుస్సు: ఈ రాశివారు ఇత్తడి, పసుపు బట్టలు, పసుపును దానంగా ఇవ్వాలి
10. మకర రాశి: సూర్యభగవానుడిని పూజించిన తర్వాత ఉసిరి, నల్ల వస్త్రం, నల్ల నువ్వులు, దుప్పటి, ఇనుము మొదలైన వాటిని దానంగా ఇవ్వాల్సి ఉంటుంది.
11. కుంభరాశి: ఈరాశివారు ఉసిరి, నల్ల గుడ్డ, నల్ల నువ్వులు, దుప్పటి, ఇనుము మొదలైన వాటిని ఎవరికైనా దానంగా ఇవ్వాల్సి ఉంటుంది.
12. మీనరాశి: ఈ రాశివారు విష్ణు చాలీసా, గీత, బంగారం, ఇత్తడి, పసుపు వస్త్రాలు, పసుపు దానం చేయడం మంచిది.












Click it and Unblock the Notifications