జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం

తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆ వ్యక్తి ఆలోచనా తీరును, ప్రవర్తనను, స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మనకు తెలుగులో 27 నక్షత్రాలున్నాయి.

ఇవి కాకుండా ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్య సూక్ష్మమైన అభిజిత్ నక్షత్రం ఉంటుంది. శుభ ముహూర్తాల కోసం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నక్షత్రం మాత్రమే మొత్తం జాతకాన్ని నిర్ణయించదు. జాతక చక్రంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్థితి , అవి ఇచ్చే దృష్టి కూడా ఫలితాలను మారుస్తాయి. అందుకే నక్షత్రాన్ని జాతకానికి పునాదిగా తీసుకుంటారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశలను బట్టి ఫలితాల్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

April Horoscope Predictions for Individuals Born Under the Rohini Mrigashira or Arudra Nakshatras

రోహిణి నక్షత్రం (వృషభ రాశి)

రోహిణి నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. ఆందోళన వద్దు. అయితే, మీ సహనం, పనితీరు వల్ల పై అధికారుల మెప్పు పొందుతారు. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కాబట్టి అనవసరపు ఖర్చులను తగ్గించుకోకపోతే ఇబ్బంది పడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కొంత లాభం ఈ సమయంలోనే అందుకుంటారు.

కంటికి సంబంధించిన సమస్యలు లేదా నిద్రలేమి ఇబ్బంది పెడుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ నెల మొత్తం మితాహారం, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం ఉత్తమం. శుక్రవారం రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం లేదా అమ్మవారిని దర్శించుకోవడం వీరికి శుభప్రదంగా ఉంటుంది.

మృగశిర నక్షత్రం (వృషభ రాశి 1, 2 పాదాలు, మిథున రాశి 3, 4 పాదాలు)

మృగశిర నక్షత్రం వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో నుంచి మీకు రావాల్సిన మొండి బాకీలన్నీ వస్తాయి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.

ఆరుద్ర నక్షత్రం (మిథున రాశి)

ఆరుద్ర నక్షత్ర జాతకులు ఏప్రిల్ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగులతో వాదనలకు దూరంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మాటతీరువల్ల ఎదుటివారు నొచ్చుకుంటారు. ఆదాయం బాగున్నా, ఊహించని ఖర్చులు రావచ్చు. ప్రయాణాల్లో డబ్బును జాగ్రత్తగా పెట్టుకోవాలి. మానసిక ఆందోళన ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. శారీరకంగా అలసిపోవడం, చెమట పట్టడంవల్ల మీకు మనసు చాలావరకు ప్రశాంతతనిస్తుంది. ప్రతిరోజూ 'శివ పంచాక్షరి' మంత్రాన్ని జపించడం లేదా సోమవారం శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మంచి మార్పులు వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+