జులైలో ఈ రాశివారికి 3 ఊహించని సంఘటనలు
కుంభరాశిలో జన్మించినవారు బంధాలను ఇష్టపడతారు. అయినవారికోసం ఏం చేయడానికైనా వీళ్లు వెనకాడరు. ఎంతమంది స్నేహితులున్నప్పటికీ అందరితో ఒకేవిధంగా వ్యవహరిస్తారు. కొన్ని అలవాట్లను మార్చుకుంటే వీరు అనుకున్నది సాధిస్తారు. జాతక చక్రంలో 11వ రాశి అయిన కుంభానికి అధిపతి శని. కుంభ రాశికి పురుష రాశి, స్థిర రాశి వంటి పేర్లున్నాయి. కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాలు, శతభిషానక్షత్రంలోని 1,2,4, పూర్వాభాద్ర 1,2,4 పాదాలుంటాయి.
తమకున్న తెలివితేటలతో వీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. జీవిత భాగస్వామి దొరికిన తర్వాత వీరి జీవితం చాలా బాగుంటుంది. అన్నీ కలిసివస్తాయి. ఏదైనా వ్యాపారంలో భాగస్వామిగా చేరినా అది కూడా కలిసివస్తుంది. కుంభరాశివారికి జీవితం అత్యంత ఆసక్తికరంగా సాగుతుంటుంది. జులైలో బుధుడు వృషభరాశిలో సంచరించనున్నాడు.

దీంతోపాటు మిథునరాశిలో కూడా సంచరిస్తాడు. అదే సమయంలో సూర్యుడు వృషభరాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు కర్కాటక రాశిలో, గురువు, రాహువు మేషరాశిలో ఉన్నారు. అన్ని రాశులపై గ్రహాల సంచార ప్రభావం ఉంటుంది. ఇప్పటివరకు మీ జీవితంలో జరగని సంఘటనలు... ముఖ్యంగా మీకు బాగా కావాల్సినవారు... మీకు అత్యంత ఇష్టమైనవారికి అనుకోని ఆపద ఎదురవుతుంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు.

జీవిత భాగస్వామితో ఇప్పటికే మనస్పర్థలు ఏర్పడి ఉంటాయి. వివాదాలు పెద్దవయ్యే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటారు. కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. విద్యార్థులకు శుభ ఫలితాలుంటాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. సంతానం కోసం చూసేవారికి సంతానం కలుగుతుంది. వివాహం కోసం ఎదురుచూసేవారికి శుభవార్త అందుతుంది. శనిదేవుడిని నిత్యం పూజించాలి. తైలాభిషేకం చేయిస్తే మంచిది. హనుమాన్ చాలీసా చదువుతుండాలి. శనగలు దానం చేయడంతోపాటు పేదలకు మీ స్థాయికి తగినట్లుగా సహాయం చేయండి.












Click it and Unblock the Notifications