వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ దేవుని ఏ సమయాల్లో పూజించాలి?: షష్టిపూర్తి ఎందుకంటే..;?

పురాతన కాలంనుంచి అంటే మహాభారతం జరిగిన కాలం నుంచీ వాస్తుశాస్త్రమును అవలంభిస్తున్నట్లు వుంది. రామాయణంలో అరణ్యవాస సమయంలో లక్ష్మణుడు కుటీరం నిర్మించగానే శ్రీరాముడు సీతాదేవితో కలిసి వాస్తుపూజచేసి గృహప్రవేశ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జ్యోతిష్కుడు ఈ సందర్భంగా మూడు విషయాలపై వివరంగా చెప్పారు. వాటిలో..

1. ఏ దేవుని ఏ సమయాల్లో పూజించాలి?

తెల్లవారుజామున 3గంటలకు శ్రీమహావిష్ణువును పూజిస్తే ఆయన దయ మనపై అపారంగా ఉంటుంది. ప్రాతఃకాలము సూర్యభగవానుని ఉదయం 6గం||లోగ పూజించాలి. ఈ సమయంలోని పూజ.. శ్రీరామచంద్రునికి, శ్రీవేంకటేశ్వర స్వామికి కూడా ఇష్టమైనది. ఉదయం 6-7 గం|| వరకూ పరమశివుడ్నీ దుర్గదేవిని పూజిస్తే మంచి ఫలితము కలుగుతుంది. మధ్యాహ్నము 12 వేళ హనుమంతుని పూజించిన ఆయన కృపకు పాత్రులవుతారు. సాయంత్రము 3 గంటలకు రాహువును పూజిస్తే మంచి ఫలితము కలుగు తుంది. సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన సమయం. రాత్రి 6-9 గం|వరకూ లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కృపాకటాక్ష ములు మనపై ఎప్పడూ ఉంటాయి.

astrologer tells about god worship

2. వాస్తు శాస్త్రమును ఎప్పటినుంచి అవలంభిస్తున్నారు

పురాతన కాలంనుంచి అంటే మహాభారతం జరిగిన కాలం నుంచీ వాస్తుశాస్త్రమును అవలంభిస్తున్నట్లు వుంది. రామాయణంలో అరణ్యవాస సమయంలో లక్ష్మణుడు కుటీరం నిర్మించగానే శ్రీరాముడు సీతాదేవితో కలిసి వాస్తుపూజచేసి గృహప్రవేశం చేశారు. విశ్వకర్మ మయుడూ, వాస్తు శాస్త్రనిపుణులే, ఆరోగ్యానికీ, ఆహ్లాదానికీ, ఆనందానికీ అన్నింటికీ మూలమే వాస్తుశాస్త్రమే. సుగ్రీవుని పట్టాభిషేకము తరువాత సీతాన్వేషణకు నిరీక్షిస్తున్న సమయంల్లో శ్రీరామలక్ష్మణులు వాస్తు చూసుకునే కొనసాగారు.

3. పృష్టి పూర్తి వేడుకలు ఎందుకు చేసుకోవాలి?

ఇరవై సంవత్సరాల బాల్యమూ, మరో నలభై సంవత్సరాలు యవ్వనమూ, కౌమారాలతో అరవై నిండిపోతాయి. అప్పటికే ఎంతో అలసి పోతారు తప్పులూ, ఒప్పులూ, కష్టాలూ, నష్టాలూ, అయిన వార్ని దూరం చేసుకోవటమూ వంటి వన్నీ అనుభవించి, అరవైకి చేరుకున్నాక వెనుతిరిగి చూసుకోవటమే షష్టిపూర్తి.
కోపావేశాలూ, పగలూ, ప్రతీకారాలూ, పట్టదలలూ వదలి అందర్నీ ఆహ్వానించి, అన్ని తప్పులనూ క్షమించటమే కాకుండా తనను క్షమించగలిగే వారికి క్షమాపణ చెప్పి అందర్నీ ఆహ్వానించి చేసుకునే పండుగే షష్టిపూర్తి, ఆ వయసు వచ్చేటప్పటికీ అలా షష్ఠిపూర్తి చేసుకోవటం ద్వారా తను వదిలేసిన కర్మలేమన్నాయో తెలుస్తుంది. అందుకే ఆ సమయంలో తులా భారం తూగి ధనాన్ని పేదలకి పంచుతారు. అయిన వారికీ, ఆడపిల్లలకీ కావలిసినవన్నీ ఇస్తారు.

English summary
Astrologer described about how to worship God.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X