మీనరాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల ఇంట్లోకి లక్ష్మీదేవి
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈనెల 15వ తేదీన ఈ పరిణామం చోటుచేసుకోబోతోంది. అదే సమయానికి మీన రాశిలో శనిదేవుడు సంచారం చేస్తుంటాడు. ఈ రెండు గ్రహాలు కలుసుకోవడంతో కొన్ని రాశులవారికి అద్భుతమైన లాభాలున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా లాభపడతారని చెబుతున్నారు. ఆయా రాశుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కర్కాటక రాశి
వ్యాపారాలు చేసేవారు తమ వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. పోటీ పరీక్షలు రాసేవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి సమాజంలో హోదా పెరుగుతుంది. అందరూ గౌరవిస్తారు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అదృష్టం వరిస్తుంది. సొంతంగా కొందరు వ్యాపారాలు ప్రారంభిస్తారు.

వృశ్చిక రాశి
ప్రేమలో ఉన్నవారికి బాగుంటుంది. అన్నివైపుల నుంచి అనుకూలంగా ఉంది. తెలివితేటలతో మంచి మంచి నిర్ణయాలు తీసుకొని పెద్దలను ఒప్పిస్తారు. కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. అలాగే వాహన యోగం ఉంది. పిల్లలు లేనివారికి సంతాన యోగం ఉంది. ప్రతి రోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శని, సూర్యుడిని పూజించడం వల్ల అనుకున్నరీతిలో పనులవడమే కాకుండా విశేషమైన ఫలితాలను పొందుతారు.
మేష రాశి
ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. విదేశీ ప్రయాణానికి అవకాశాలున్నాయి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులన్నీ ప్రారంభమవుతాయి. వీటి నుంచి భారీ మొత్తంలో డబ్బు వస్తుంది. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. అలాగే కొన్ని కొన్ని కొత్త బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. అంతా సానుకూలంగా సాగుతుంది.
మిథున రాశి
వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలున్నాయి. వీరికి సమాజంలో హోదా, గౌరవం పెరుగుతుంది. భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. అంతా శుభప్రదంగా సాగుతుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంటుంది. అదృష్టం ఎప్పుడూ తోడుగా ఉంటుంది.












Click it and Unblock the Notifications