నాగుల(గరుడ) పంచమి ప్రత్యేకతేమిటి? ఈరోజు ఏం చేస్తారు?
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
హైదరాబాద్: నాగుల పంచమి / గరుడ పంచమి ప్రతి సంవత్సరం శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి , గరుడ పంచమి గా పిలుస్తారు .భారతీయ సంస్కృతిలో నాగదేవత ( పుట్ట ) పూజకు ఒక గొప్ప విశిష్టత మరియు సంప్రదాయముగా ఆచరణలో ఉంది.
మనం నిత్యం పూజించే నారాయణుడి శేషశయునుడి పర్వంమే ఈ " నాగ పంచమి " . బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టకు పాలు పోస్తారు.

నాగ పంచమి ఎలా చేస్తారు?
నాగ పంచమి రోజున ముందుగా ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకుంటారు. తర్వాత తలంటుకుని, నిత్యపూజ పూర్తి చేస్తారు.ఆ పైన దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు జల్లి ముగ్గు వేసి, పసుపు, కుంకుమలు పెడతారు. గంధం చిలకరిస్తారు. దీపం, అగరొత్తులు వెలిగించి, అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ ఐదు నాగ దేవతలనూ మనసులో స్మరించుకుని, భక్తిగా నమస్కరిస్తారు.
పాలు, పండ్లు,నాగపడిగేలు, నువ్వులు, జొన్నపెలాలు, పంచామృతం మొదలైన వాటిని నాగ దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు.
విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః
న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్
- అనే మంత్రాన్ని స్మరిస్తూ పుట్ట దగ్గర ఒక ఆకుతో చేసిన దొప్పలో ఆవుపాలు పోయాలి.నాగ విగ్రహాలకు మాత్రం శిరస్సుపై నుండి పోయాలి.కాని పాలు పుట్టలో పోయకూడదు.
నాగ పంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. అంతకంటే ముందు ఐదుగురు అతిథులను ఇంటికి ఆహ్వానించి, ప్రసాదం ఇచ్చి, విందు భోజనం పెడతారు. శక్తి లేనివారు కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టి, ఆ తర్వాతే వారు తింటారు.
నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి.అంతా అనుకూలంగా ఉంటుంది.
నాగ పంచమి,సంతాన సంబంధమైన విషయాలలో శుభం కలుగుతుంది.
కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు.
కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగపంచమి నాడు పుట్ట దగ్గర పాలు పోస్తే సర్ప దోష నివారణ జరిగి, కుటుంబ సుఖ సంతోషాలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications