AStrology: స్నానం ఎప్పుడుపడితే అప్పుడు చేస్తున్నారా.. అయితే అరిష్టమే..!
స్నానం ఎప్పుడిపడితే అప్పుడు చేయడం మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ప్రతి రోజు అందురు చేసే పని స్నానం చేయడం. రోజు స్నానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇందులో అందరు రోజు స్నానం చేస్తారు కదా అని అనుకుంటారు. అయితే స్నానం అనేది ఎప్పుడుపడితే అప్పుడు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఏ టైంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం..

10 గంటల తర్వాత
కొంత మంది ఉదయం 10 గంటల తర్వాత స్నానం చేస్తారు. మరికొందరు మధ్యాహ్నం స్నానం చేస్తారు. ఇది మంచిది కాదని శాస్త్రం చెబుతుంది. వీలైనంత త్వరగా ఉదయమే స్నానం చేయాలని సూచిస్తున్నారు. ఉదయం ఆరు గంటలలోపు స్నానం చేస్తే ఇంకా మంచిదని వివరిస్తున్నారు. తెల్లవారుజామున స్నానం చేస్తే దేవతా స్నామంటారట.

8 గంటలోపు
ఉదయం 8 గంటలోపు స్నానం చేస్తే మంగళ స్నామని అంటారని పేర్కొంటున్నారు. అలాగే సాయంత్ర స్నానం చేయడం కూడా మంచిదట. అంటే ఉదయం చేయకుండా సాయంత్రం స్నానం చేయమని అర్థం కాదు. ఉదయం, సాయంత్రం స్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు. సాయంత్రం స్నానం చేయడం వల్ల ప్రశాతంగా నిద్రపొవచ్చట.

భోజనం చేసిన వెంటనే
కొందరు భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తారు. కానీ అలా చేయకూడదట. ప్రభాతవేళ అంటే తెల్లవారుజాము 4, 5 గంటమధ్య చేసే స్నానాన్ని ఋషి స్నానమని.. ఉదయం 5,6 గంటల మధ్య చేసేది స్నానాన్ని దేవతా స్నానమని, ఉదయం 6,8 గంటల మధ్య చేసేది మంగళస్నామంటారు. అలాగే స్నానం చేసేటప్పుడు శబ్ధం చేయకూడదట. బుషి స్నానం చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అరగంట
కొందరు స్నానం 10 నిమిషాల్లో కానిచ్చేస్తారు. కానీ స్నానం అరగంటపాటు చేయాలని చెబుతున్నారు. కొందరు
హడావుడిగా నాలుగు చెంబుల నీళ్లు వంటిపై పోసుకొని స్నానం పూర్తి చేస్తారు. స్నానం చేయాలంటే ముందుగా తలపై నీళ్లు పోసుకుని ఆ తరువాత వీపు, శరీరభాగం, కాళ్లు, చేతులు, ముఖం ఇలా అన్ని శరీర అంగాలు అన్ని తడిసే విధంగా స్నానం చేయాలట.
Note: ఈ సమాచారం కేవలం జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఇచ్చాం. దీన్ని వన్ ఇండియా తెలుగు ధృవీకరించడం లేదు.












Click it and Unblock the Notifications