తల,తలంటు స్నానం ఏరోజు ఏ ఫలితం?

తల స్నానం ,తలంటు స్నానం ఏరోజు చేస్తే ఏ ఫలితం వస్తుంది, అనే విషయం గురించి శాస్త్రం మనకు కొన్ని ఆరోగ్య సూచనలు చేసింది. వాస్తవానికి తలస్నానం అనేది అందరికి రోజు చేసే వీలు,వసతి కలుగదు . అలాంటి వారు వారనికి రెండు,మూడు రోజులు తలస్నానం చేసేవారికోసం ప్రత్యేకించి వారంలోని కొన్ని దినాలలో తలస్నానం చేస్తే ఆరోగ్యకరమైన శరీరం కలిగి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది.

మరికొన్ని దినాల్లో తలస్నానం చేస్తే అనారోగ్యమైన పరిస్థితి మరియు ఇతర విషయలలో ప్రతికూలంగా ఉంటుంది.కాబట్టి అన్ని విధములుగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే మంచిది. తలస్నానము ఏ రోజు చేస్తే మంచిది.

ఈ విషయం గురించి మనం శాస్త్రరీత్యా దీనిని పరిశీలించినట్లైతే స్నానాలు ఉదయం పూటనే చేయాలి,సూర్యోదయంనకు పూర్వం చేస్తే చాలా మంచిది.పొద్దు పోయాక చేస్తే లేదా తిని చేస్తే అనారోగ్యం కలుగుతుంది.వృద్దులు,రోగులు ఎండ వచ్చాక చేస్తే తప్పులేదు.

Astrology: Auspicious day for head bath

శరీరం సహకరించిన వారు శాస్త్రానికి విరుద్ధంగా పోతే తర్వాత కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ముఖ్యంగా స్త్రీలు తల స్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసి స్నానం చేయకూడదు, జుట్టు చివర్లు ముడి వేసుకుని స్నానం చేయాలి,ఇలా చేస్తే శుభకరం,మంగళకరం. వారపు రోజులలో శుభ,అశుభ ఫలితాలను ఈ క్రింది తెలుప బడ్డాయి.

ఆదివారం నాడు తల స్నానం, తలంటు స్నానము చేసినచో ఆరోజు అనుకూలం కాదు. ఫలితం శరీర కాంతి(అందం) తగ్గుతుంది,కలత,అనారోగ్యం ఏర్పడుతుంది,దు:ఖప్రదం,సంతానంనకు కీడు. కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తలస్నానం చేయవలసి వస్తే దోష పరిహారం కొరకు కొబ్బరినూనెలో ఏవేని కొన్ని పూలను కలిపి తలంటుకుని స్నానం దోష పరిహారం జరుగుతుంది.

సోమవారం తలస్నానం పనికిరాదు.ఫలితం కలవరము, కాంతిహీనం,భయం కలుగుతుంది.దోష పరిహారం కొరకు కొబ్బరినూనెలో మందారపూలను వేసి తలంటుకొని స్నానం చేస్తే దోషపరిహారం కాగలదు.

మంగళవారం తలస్నానం అసలే పనికి రాదు. చేస్తే ఫలితం విరోధం, అపాయం, ఆయుక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది. దోష పరిహారం కొరకు నూనెలో చిటికెడు పుట్టమన్ను|ఆవు తోక్కిన మట్టిని కలిపి తలస్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది.

బుధవారం తలస్నానం చేస్తే ఫలితం శుభం. ఫలితం లాభం, కీర్తి, సంపద కలుగును, జ్ఞానము కలుగును, బుద్ధి వికసించును.

గురువారం రోజు తలస్నానం చేసిన ఫలితము. అశాంతి, విద్యా లోపము, ధనవ్యయం,కీడు, శత్రువులు అధిక మవుతారు. దోష పరిహారం కొరకు నూనెలో గరిక కానీ పుష్పాలను కానీ కలిపి తలంటుకుని స్నానం ఆచరించిన దోషపరిహారం కాగలదు.

శుక్రవారం తలస్నానం చేసిన ఫలితం. అశాంతి, వస్తు నాశనం, రోగ ప్రదం. దోష పరిహారం కొరకు నూనెలో చిటికెడు విభూతిని గానీ గోమయము గానీ కలిపి తలంటుకుని స్నానం చేస్తే దోషపరిహారం కాగలదు.

శనివారం తలస్నానం చేస్తే ఫలితం. ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ లాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, శుభకరమైనది. ఈ రోజు తప్పక అందరు తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది.

శాస్త్ర ప్రకారము తలస్నానం, తలంటు స్నానమును బుధవారం, శని వారం రోజుల్లో చేస్తే శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పండగ పర్వదినాలలో,పుణ్యక్షేత్రాలలో,పుట్టినరోజు నాడు తలస్నానం చేయుటకు శాస్త్రప్రకారంగా ఎలాంటి నియమములు లేవు,అది ఏ వారమైనను నిస్సంకోచకంగా తలస్నానం చేయవచ్చని శాస్త్రము సూచిస్తుంది. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయమేమిటంటే ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నవారికి ఈ నిబంధనలు వర్తించవు ఇది గమనించాలి.

వారానికి రెండు సార్లు చేసే వాళ్లకే ఈ నియమ నిబంధనలు వర్తిస్థాయి.ముఖ్యంగా ప్రతిరోజు తలస్నానం చేసే వారు,వారానికి రెండుసార్లు స్నానం చేసే వారైన కనీసం నెలలో కనీసం నాలుగు సార్లు అయిన స్నానపు నీటిలో చిటికెడు పసుపు,కర్పూరం పోడి వేసుకొని తల స్నానం చేయడం వలన గ్రహ దోష నివారణలకు చక్కని తరుణోపాయంగా ఉపయోగపడుతుంది జైశ్రీమనారాయణ.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+