కొద్దిరోజులు ఓపిక పట్టండి.. మార్చి 13 నుంచి ఈ రాశులకు తిరుగుండదు
గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, వ్యాపారం, తర్కం, లెక్కలకు కారకుడు. ప్రతి నెలా రాశి సంచారం చేసే బుధుడు మార్చి లో కుంభరాశిలో రెండుసార్లు అస్తమించబోతున్నాడు. చాలా అరుదుగా జరిగే ఈ పరిణామంవల్ల కొన్ని రాశులకు లాభదాయకంగా ఉంటుంది. సంచారంతోపాటు బుధుడు తిరోగమనంలో కూడా పయనిస్తాడు. ఏయే రాశులకు ఎలా కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం.
తులారాశి
ప్రేమ సంబంధాలు బాగుంటాయి. ఇరువైపు కుటుంబాలు అంగీకరించే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులకు కలిసివస్తుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించి మంచి లాభాలు ఆర్జిస్తారు.

ధనుస్సు రాశి
చేసే ప్రతి పనిలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సీనియర్ అధికారుల నుంచి గౌరవాన్ని కూడా పొందుతారు. ఉద్యోగస్థులకు అన్నివిధాలుగా బాగుంటుంది. డబ్బులు కూడా కోరుకున్న స్థాయిలో సంపాదిస్తారు. ఎన్నో ప్రయోజనాలను అందుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది.
మిథున రాశి
ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయం వీరికి బాగుంటుంది. అనుకోకుండా ధనలాభం ఉంది. మార్చి నెలాఖరు వరకు వీరు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది.
కన్యారాశి
ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణాల సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టి భవిష్యత్తులో వాటి నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారం వీరికి బాగా కలిసివస్తుంది. 13వ తేదీ తర్వాత వీరికి ఎంతో శుభప్రదంగా అన్ని పనులు అవుతాయి. అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నారు.












Click it and Unblock the Notifications