గురు ఆదిత్య రాజయోగంతో ఈ రాశుల పంట పండింది
మార్చి నెలలో గ్రహాల సంయోగం పరంగా అరుదైన పరిణామం చోటుచేసుకోబోతోంది. వచ్చే నెల 15వ తేదీన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఆ రోజు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయానికి దేవతల గురువైన గురువు అక్కడే సంచారం చేస్తుంటాడు. ఇలా సూర్యుడు, గురువు కలుసుకోవడంతో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడి కొన్ని రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు తెస్తోంది. అదృష్టవంతులయ్యే ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ప్రయాణాలు కలిసివస్తాయి. ఉన్నత విద్య లేదా పరిశోధన రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఇది మంచి సమయం. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రాజయోగం అడుగడుగునా శుభవార్తలను మోసుకొస్తుంది. విద్యార్థులకు, సంతానం కోసం ఎదురుచూసే వారికి సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి. తమ సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందుతారు. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు పెళ్లికి దారితీస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడంతో సంతోషంగా ఉంటారు.
మీన రాశి
వీరికి సర్వతోముఖాభివృద్ధిని ఈ రాజయోగం ప్రసాదిస్తుంది. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా మిమ్మల్ని మీరు తీర్చి దిద్దుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు లాభసాటిగా మారతాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మంచి స్థాయికి చేరుకుంటారు.
మేష రాశి
వీరికి అన్నీ సానుకూలమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడటంతో పాటు బాగా బలపడతారు. కీలకమైన నిర్ణయాలు తీసుకొని మంచి విజయాలు సాధిస్తారు.
మిథున రాశి
మిథున రాశి వారికి కెరీర్ ఒక సువర్ణ అధ్యాయంలా మారనుంది. కార్యాలయాల్లో పదోన్నతులు లభించడమే కాకుండా, కొత్త బాధ్యతలు వీరిని నిలబెడతాయి. వ్యాపారవేత్తలకు లాభాలు అందడమే కాకుండా, దీర్ఘకాలిక ప్రణాళికలవల్ల ఊహించని విజయాలను సాధిస్తారు.












Click it and Unblock the Notifications