నక్షత్రాలు మార్చిన బుధుడు, కుజుడు.. ఈ రాశులకు అద్భుతమైన సంపాదన
గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, తర్కం, లెక్కలు, వ్యాపారం, జ్ఞానానికి కారకుడు. అటువంటి బుధుడు పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తుండటంతో వ్యక్తుల మేథోవికాసం చాలా ప్రబలంగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. ఈనెల 15వ తేదీన కుజుడు ధనిష్ట నక్షత్రంలోకి అడుగు పెట్టాడు. దీనివల్ల కొన్ని రాశులకు ఊహించనిస్థాయిలో ధనలాభం కలిగింది. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం. అందులో మీ రాశి ఉందా? లేదా? అనేది పరిశీలించుకోండి.
సింహరాశి
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. పెద్దల నుంచి, భార్యవైపు నుంచి కూడా ఆస్తులు కలిసివచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వీరు ధనవంతులవుతారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రమోషన్స్ ఉన్నాయి. అదృష్టం సహకరించడంవల్ల అనేక ప్రయోజనాలను అందుకుంటారు. చేతికి భారీ మొత్తంలో డబ్బులు అందుతాయి.

వృశ్చిక రాశి
దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. జీవితం సంతోషంగా గడుస్తుంది. అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత విజయవంతమవుతారు. ప్రత్యర్థులపై కూడా విజయం ఉంది. సామాజికంగా, ఆర్థికంగా మీ హోదా గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారంలో మంచి పురోగతి కనపడుతోంది.
మేషరాశి
న్యాయ సంబంధిత కేసుల్లో విజయాలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. నాయకత్వ లక్షణాలున్నవారు అద్భుతంగా రాణించడంతోపాటు పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. వీటివల్ల ఊహించనిస్థాయిలో ఆర్థిక లాభాలు అందుతాయి. ధనిష్ట నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించడంతో ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది.
మిథున రాశి
కమ్యూనికేషన్స్ కు సంబంధించిన రంగాల్లో పనిచేస్తున్నవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. రచన చేయడంలో మిమ్మల్ని మించినవారు ఉండరు. మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే ఉద్యోగ అవకాశాలు ఆకస్మికంగా వస్తాయి. వాటిల్లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. నక్షత్రాన్ని బుధుడు, కుజుడు మార్చడంవల్ల కొన్ని కొన్ని కీలక నిర్ణయాలను ఈ రాశివారు తీసుకోబోతున్నారు.












Click it and Unblock the Notifications