Astrology: పెళ్లి కావటం లేదా? ఈ పరిహారాలతో పెళ్లిసన్నాయి మోగుతుంది.. ట్రై చెయ్యండి!!
చాలామంది వివాహం కోసం ఎంత ప్రయత్నం చేసినా కళ్యాణ ఘడియలు రావడం లేదని తెగ బాధపడుతూ ఉంటారు. అయితే వివాహం కాకపోవడానికి, కళ్యాణ ఘడియలు రాకపోవడానికి గ్రహాలు అనుకూలించక పోవడమే కారణమని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. గ్రహాల బలమైన మరియు బలహీనమైన స్థానాలు వ్యక్తుల జీవితం పైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి.
ఎవరి జాతకంలో అయితే బృహస్పతి బలహీనంగా ఉంటాడో వారి జాతకంలో వివాహం కష్టంగా మారుతునేది. పెళ్లి అనేక ఇబ్బందులతో జాప్యం జరుగుతూ వస్తుంది. బృహస్పతి బలహీనంగా ఉంటే వివాహ సంబంధమైన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కాబట్టి బృహస్పతిని బలపరచడం కోసం కొన్ని పరిహారాలను చేస్తే కళ్యాణ ఘడియలు వచ్చి భాజా భజంత్రీలు మోగుతాయి అని చెబుతున్నారు. మరి ఆ పరిహారాలు ఏంటో ప్రస్తుతం తెలుసుకుందాం.

నవగ్రహాలలో బృహస్పతిని అతిపెద్ద గ్రహంగా పరిగణిస్తారు. బృహస్పతి కి సంబంధించి గురువారం రోజును పాటిస్తారు. గురువారం రోజున ఆవులకు ఆహారాన్ని ఇస్తే బృహస్పతి బలపడతాడు. అంతేకాదు బృహస్పతి పసుపు రంగును సూచిస్తుంది కాబట్టి, జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నవారు గురువారంనాడు పసుపు రంగు బట్టలను ధరించడం మంచిది.
గురువారం లక్ష్మీనారాయణ పూజలు శ్రద్ధగా చేస్తే, సెనగలు, పసుపు, బెల్లం నీళ్లలో కలిపి అరటి చెట్టుకు నీరు సమర్పిస్తే జాతకంలో బృహస్పతి బలపడతారని చెబుతున్నారు. నీటిలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేస్తే బృహస్పతి బలపడి వివాహ గడియలు వస్తాయని చెబుతున్నారు.
జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నవారు జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించి పుష్య రాగాన్ని ధరించినా, గురువారం నాడు యువతులకు పసుపు రంగు బట్టలను దానం చేసిన మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు గురువారం రోజు నూనె, సబ్బు మొదలైన వాటిని ఉపయోగించకూడదని, వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించడం చేయకూడదని చెబుతున్నారు. ఈ పరిహారాలను పాటిస్తే పెళ్లి కాని యువతీ యువకుల జాతకాలలో బృహస్పతి బలపడి పెళ్లి ఘడియలు వస్తాయని, ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications