వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్యోతిషం: ఉత్తరాయణం మొదలైంది

ఒక రాశిలో నుండి మరొక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించే సమయమును సంక్రాంతి లేక సంక్రమణమని చెబుతున్నారు.సంక్రాంతి నుండి ఉత్తరాయణం ప్రారంభము ఇక ఈ ఉత్తరాయణ పుణ్యకాలమున చేయదగిన విధి విధానము ధర్మసింధువు నందు ఇ

By Pratap
|
Google Oneindia TeluguNews

పండుగలన్నీ ఏదోఒక తిథి ప్రాతిపదికగ వచ్చేవే. ఉదాహరణకు, వినాయకచవితి, కృష్ణాష్టమి, మహర్నవమి, విజయదశమి, దీపావళి అమావాస్య మొదలైనవి. ఈ పండుగలలో ఏదో ఒక దేవతారాధన చేయడం అందరికీ తెలిసినదే. అంతేగాక వీటి వెనుక ఆధ్యాత్మికత కూడ టుంది. అటువంటి పండగలలో సంక్రాంతి పెద్ద పండగ.

తిథి ప్రాతిపదికగా జరుపుకోని పండుగ సంక్రాంతి. మిగతా పండుగలన్నీ చాంద్రమానమును అనుసరించి వచ్చేవైతే ఈ పండుగ మాత్రం సూర్యగమనమును అనుసరించి వచ్చేది. సూర్యుడు ఒక సంవత్సరములోని పన్నెండు మాసా
లలో, ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క మాసముంటాడు.

ఒక రాశిలో నుండి మరొక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించే సమయమును సంక్రాంతి లేక సంక్రమణమని చెబుతున్నారు.
సంక్రాంతి నుండి ఉత్తరాయణం ప్రారంభము ఇక ఈ ఉత్తరాయణ పుణ్యకాలమున చేయదగిన విధి విధానము ధర్మసింధువు నందు ఇలా చెప్పబడింది.

Astrology: Uttarayanam begins

రవిసంక్రమణే ప్రాస్తే నస్నాయాద్యస్తు మానవః
సప్తజన్మ సురోగీస్యా నిర్ధనశ్చైవ జాయతే
రవి సంక్రమణమునందు స్నానము చేయని నరుడు సప్త జన్మముల, నిర్ధనుడు అవుతాడని దీని భావము. కనుక ఈ పుణ్యకాలమందు స్నానమావశ్యకమని తెలుస్తోంది.
సంక్రాన్తౌ యాని దత్తాని హవ్యకవ్యాని దాత్మభిః
తాని నిత్యం దదాత్యర్క పునర్జన్మని జన్మని

సంక్రానియందే ఏ దానములు, ఏయే కర్మలు చేస్తారో వారు తిరిగి ప్రతి జన్మయందు అటువంటి ద్రవ్యములను, అటువంటి కర్మలను సూర్యానుగ్రహంతో పొందుతారని దీని భావము. ఉత్తరాయణమందు తిల ధేను దానము, తిలతైలముచే శివాలయమందు దీపదానము, తిలలు తండులములు కలిపి శివుని పూజించుట, నల్లనువ్వులతో స్నాననభ్యంగము, తిలదానము తిలహోమము తిలభక్ష్యము చేయాలని, తెల్ల నువ్వులతో దేవతర్పణమును, నల్లనువ్వులతో పితృతర్పణము చేయాలని తెలుస్తోంది.

ఒక రాశిలో నుండి మరొక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించే సమయమును సంక్రాంతి లేక సంక్రమణమని చెబుతున్నారు.
సంక్రాంతి నుండి ఉత్తరాయణం ప్రారంభము ఇక ఈ ఉత్తరాయణ పుణ్యకాలమున చేయదగిన విధి విధానము ధర్మసింధువు నందు ఇలా చెప్పబడింది.

English summary
According to astrologer Uttarayanam has begun after Makara Sankranthi festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X