శ్రావణ మాసంలో శుభ ముహూర్తాలు ఇవే

శ్రావణ మాసం ప్రారంభమైంది. ఆషాఢమాసం వరకు ఎవరూ ఎక్కడా శుభకార్యాలు నిర్వహించలేదు. ఎందుకంటే శుభ ముహూర్తాలు లేకపోవడమే. శ్రావణ మాసం ఈనెల ఐదోతేదీ నుంచి ప్రారంభమైంది. ఈనెల మొత్తం భాజాభజంత్రీలు మోగనున్నాయి. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, కొత్త వ్యాపారాల ప్రారంభంలాంటివన్నీ ఈనెలలో భారీసంఖ్యలో ఉంటాయి. హిందూ మతంలో శ్రావణ మాసం అంటే అత్యంత పవిత్రమైన మాసం. లక్ష్మీదేవితోపాటు పరమేశ్వరుడిని పూజిస్తారు.

వరలక్ష్మి వత్రం, మంగళగౌరీ వ్రతం రాఖీపౌర్ణమి,కృష్ణాష్టమితోపాటు ప్రతి శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణశుక్రవారాలు అత్యంత పవిత్రమైనవి. రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తారు. మహిళలకు అది పెద్ద పండగలాంటిది. ఈ మాసంలో పెళ్లిళ్లు కూడా ఎక్కువగా జరుగుతాయి. ఈనెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీల్లో పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలున్నాయి.

auspicious dates for wedding in shravana masam august 2024

నైరుతి రుతుపవనాల రాకతో శ్రావణ మాసం అనుసంధానించబడివుంటుంది. దేశం మొత్తానికి ఇది చాలా ముఖ్యమైనది. మంగళవారం ఉపవాసం ఉండటాన్ని మంగళ గౌరీ వ్రతం అంటారు. రక్షాబంధన్ ను రాఖీ పూర్ణిమ లేదా రాఖీ అని పిలుస్తారు. సోదర సోదరీమణుల మధ్య బంధాన్ని ఇది సూచిస్తుంది. రక్షా బంధన్ అంటే రక్షణ బంధం. ఎద్దులను గౌరవించే పండుగ పోలా. మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు. రైతులు, వారి కుటుంబ సభ్యులు ఎద్దులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. శ్రావణ మాసం చివరి రోజు లేదంటే అమావాస్య రోజు వస్తుంది.

రాఖీ పూర్ణిమ రోజు సముద్ర దేవుడైన వరుణుడికి గౌరవంగా కొబ్బరికాయను సముద్రానికి సమర్పించడం ఆచారంగా వస్తోంది. మహారాష్ట్రలోని కొంకణ్ తీర ప్రాంతాల్లో వర్షాకాలం తర్వాత సముద్రాన్ని శాంతింపచేయడానికి కొబ్బరికాయను సమర్పిస్తారు. అలాగే చేపల వేట కోసం మత్స్యకారులు సముద్రం మీదకు వెళతారు. వారికి సమృద్ధిగా చేపలు పడాలని కోరుకుంటూ వరుణుడికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ పండగ జరిగిన తర్వాత మత్స్యకారులు సముద్రంలోకి చేపలను పట్టడానికి వెళతారు. దీన్ని నరాలి పూర్ణిమ అని పిలుస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+