భద్ర మహాపురుష రాజయోగంతో సెప్టెంబర్ లో వీరికి పట్టిందల్లా బంగారం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అనేక శుభ యోగాలు ఏర్పడతాయి. కొన్ని అశుభయోగాలు కూడా ఏర్పడతాయి. ఇవి అన్ని రాశుల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే సెప్టెంబర్ నెలలో గ్రహాలు రాకుమారుడు అయిన బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
బుధ సంచారం.. భద్ర మహాపురుష రాజయోగం
బుధుడు తిరోగమన స్థితిలో కన్య రాశిలోకి ప్రవేశించడం వలన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఏడాది తర్వాత బుధుడి కారణంగా కన్యరాశిలో ఈ రాజయోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ నెలలో బుధుడి సంచారం వల్ల ఏర్పడే భద్ర మహాపురుష రాజయోగంతో లబ్ధి పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

సింహరాశి
భద్ర మహాపురుష రాజయోగం వల్ల సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతారు. వర్తక వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి భౌతిక సుఖాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా విజయం వరిస్తుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు.
కన్యారాశి
భద్ర మహాపురుష రాజయోగం కారణంగా కన్యారాశి వారికి అదృష్టం మెరుస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు బలోపేతం అవుతారు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. కెరీర్లో గొప్ప విజయాలను సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం.
ధనుస్సు రాశి
బుధుడు సొంతరాశి అయిన కన్యారాశిలో ప్రవేశించడం వల్ల ఏర్పడే భద్ర మహాపురుష రాజయోగంతో ధనుస్సు రాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. వర్తక వ్యాపారాలు జోరుగా సాగుతాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు కూడా వసూలువుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications