Sankranti 2026 : ఈసారి భోగి పండుగ చాలా స్పెషల్, మళ్లీ 2040 లోనే
పల్లెటూరులు చలి దుప్పటి కప్పుకున్నాయి. మంచు పొరలు గ్రామాన్ని దాచేస్తున్నాయి. అందుకే ప్రకృతిలో ప్రతిదానికి ఒక యాక్షన్ ఉంటే.. దానికి రియాక్షన్ కూడా కచ్చితంగా ఉంచే తీరుతుంది. చలికాలం అందాన్ని వీక్షించాలి.. కానీ అదే చలి ఎక్కువైతే ఆరోగ్యానికి ఇబ్బంది తప్పదు. అందుకే మన సంస్కృతి, సాంప్రదాయాలను పండుగలతో జోడించారు. అందులో చాలా ముఖ్యమైంది ఈ సంక్రాంతి. పెద్ద పండుగకి తొలి సంకేతం భోగి. చలి చప్పుళ్ల మధ్య తెల్లవారుజామున ఊళ్లన్నీ వెలుగుల్లో మునిగిపోతాయి. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మల మధ్య నిప్పురవ్వలు ఎగిసిపడతాయి. ఇదే భోగి. సంక్రాంతి సంబరాలకు తొలి శుభారంభం. కేవలం సంప్రదాయం కాదు... తరతరాల విశ్వాసం, ఆరోగ్య విజ్ఞానం, ఆధ్యాత్మిక సంకల్పం మేళవించిన పర్వదినం భోగి. అయితే ఈ సారి వచ్చే భోగి చాలా విశేషమైంది మాత్రమే కాదు చాలా అరుదైంది కూడా. ఎందుకంటే...
భోగి అంటే వెలుగుల పండుగకు తొలి అడుగు. భోగి మంటల్లో పాత దుఃఖాలు కాలిపోతాయి... ఉత్తరాయణంతో కొత్త ఆశలు ఉదయిస్తాయి... గోదాదేవి సంకల్పంతో భక్తి పరిమళిస్తుంది... అందుకే 2026 భోగి... కేవలం పండుగ కాదు... వెలుగు, వేడి, విశ్వాసం మిళితమైన మహాపర్వం. ఈ ఏడాది భోగి పండుగకు పంచాంగపరంగా అరుదైన ఏకాదశి యోగం కలగడం వల్ల ఈసారి భోగికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. దాని గురించి తెలుసుకునే మందు భోగి అనే పదం వెనుక అర్థాన్ని తెలుసుకుందాం..

ఉత్తరాయణానికి ముందస్తు ఆహ్వానం
భోగి అనంతరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఇది దేవతల పగలు ప్రారంభమయ్యే శుభకాలంగా భావిస్తారు. చీకటి నుంచి వెలుగులోకి... శీతాకాలం నుంచి ఉత్సాహకాలానికి... బాధల నుంచి ఆశల వైపు సాగే మార్పుని భోగి సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే, దక్షిణాయనంలో ఎదురైన కష్టనష్టాలను మంటల్లో దహనం చేసి, ఉత్తరాయణంతో సుఖసంతోషాలను స్వాగతించడమే భోగి తత్త్వం.
బలి చక్రవర్తి - భోగి మంటల వెనుక పురాణ కథ
భోగి మంటలతో ముడిపడి ఉన్న మరో విశ్వాసం బలి చక్రవర్తికి సంబంధించినది. వామన అవతారంలో శ్రీమహావిష్ణువు బలిని పాతాళానికి పంపిన తరువాత, సంవత్సరానికి ఒకసారి భూలోకానికి వచ్చి ప్రజలను దర్శించి ఆశీర్వదించే వరం ఇచ్చాడని పురాణాలు చెబుతాయి. సంక్రాంతికి ముందు రోజు బలిని ఆహ్వానించేందుకు గాను ఇళ్ల ముందర భోగి మంటలు వేస్తారని పెద్దల మాట.
2026 భోగి అరుదైన ఆధ్యాత్మిక సమ్మేళనం
2026లో భోగి పండుగ రోజునే పుష్య మాసం కృష్ణ పక్షం ఏకాదశి ప్రారంభమవుతోంది. ఇది షట్తిల ఏకాదశిగా ప్రసిద్ధి. తిథి ప్రారంభం జనవరి 13 మధ్యాహ్నం 3:18 నిమిషాలకు ప్రారంభమై.. జనవరి 14 సాయంత్రం 5:53 గంటలకు ముగుస్తుంది. భోగి పండుగకు ఏకాదశి తిథి కలవడం అత్యంత అరుదైన యోగమని పండితులు పేర్కొంటున్నారు. ఈ కారణంగా 2026 భోగి సాధారణ పండుగ కాకుండా మహావిశిష్టమైన దినంగా నిలుస్తోంది. భోగి మంటలు సాయంత్రం సమయంలో వేయడం శుభప్రదం కాదు కాబట్టి.. జనవరి 14 తెల్లవారుజామున పండుగ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
గోదాదేవి సంకల్పం - భోగి రోజునే కళ్యాణ ఘడియ
ధనుర్మాసంలో అవతరించిన గోదాదేవి, విష్ణుమూర్తిని వరుడిగా పొందాలనే సంకల్పంతో 30 రోజుల పాటు తిరుప్పావై పాశురాలు పాడుతూ వ్రతం చేసింది. ఆ సంకల్పానికి ఫలితంగా రంగనాథుడు ప్రత్యక్షమై గోదాదేవిని వివాహం చేసుకున్న దినమే భోగి పర్వదినమని సంప్రదాయం. అందుకే ఈ రోజున ఆలయాల్లో గోదాదేవి-రంగనాథుల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు.
షట్తిల ఏకాదశి - పాటించాల్సిన నియమాలు
భోగి రోజున వచ్చిన షట్తిల ఏకాదశి సందర్భంగా ఆచరించాల్సిన నియమాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఉపవాసం లేదా సాత్వికాహారం తీసుకోవాలి. నువ్వుల నూనె లేదా నువ్వుల పిండితో అభ్యంగన స్నానం చేయాలి. స్నానజలంలో నల్ల నువ్వులు కలపడం, నువ్వులను ఏదో ఒక రూపంలో సేవించడం, నువ్వుల దానం శని ప్రభావం నుంచి బయటపడేస్తాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications