5 వాస్తు చిట్కాలు పాటిస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది
వాస్తు శాస్త్రాన్ని చక్కగా అనుసరించి ఇబ్బందుల నుంచి బయటపడినవారు ఎందరో ఉన్నారు. అలాగే మీకున్న సమస్యలను కూడా వాస్తు ప్రకారం పరిష్కరించుకోవాలనుకుంటే ఈ నియమాలను పాటించండి. మీరు కూడా సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని కొన్ని నియమాలతోపాటు చిన్న చిన్న చిట్కాలు కూడా అనుసరించేవి ఉంటాయి. వాటిని అనుసరిస్తే చాలు. ఇలా చేయడంవల్ల అదృష్టం వరిస్తుంది.
ఇంటి ఆగ్నేయ మూలలో ఆకుపచ్చ మొక్కలను పెంచాలి.
ఇంట్లో ఫర్నిచర్ గుండ్రటి ఆకారంలో ఉండకూడదు.
వారానికోసారి ఇంట్లో కూర్పూరంతో హారతివ్వాలి.
దీనివల్ల వ్యతిరేక శక్తి పారిపోతుంది.
ఆవనూనెతో దీపం వెలిగించి అందులో లవంగాలను వేయాలి.
దీనివల్ల కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారు.
ఎటువంటి రోగాలైనా తొలగిపోతాయి.

ప్రతి గురువారం తులసి మొక్కకు నీటితోపాటు పాలను కూడా సమర్పించాలి.
దీనివల్ల కుటుంబంలో ఉన్న అవాంతరాలన్నీ తొలగిపోతాయి.
పెనం మీద పుల్కా, చపాతీ కాల్చుకొనేటప్పుడు పాలను చల్లుకోవడం చాలా మంచిదని భావిస్తారు.
ఇలా చేయడంవల్ల శారీరకంగా మంచి ఆరోగ్యం కలుగుతుంది.
వాస్తు ప్రకారం విరిగిపోయిన ఫర్నిచర్, చెత్త వస్తువులు ఉండకూడదు.
మన గురువుల చిత్రపటాలు చినిగిపోయి ఉండకూడదు.
అలాగే గురువుల చిత్రపటాలు చదువుకునే గదిలో లేదంటే డ్రాయింగ్ రూంలో పెట్టాలి.
దీనివల్ల వారి ఆశీర్వాదాలు కుటుంబ సభ్యులపై ఉంటాయి.
బెడ్ రూపంలో 2 మంచాలు ఉండకూడదు. ఉంటే వెంటనే తొలగించండి.
ఇలా 2 మంచాలు ఉండటంవల్ల భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications