ఈరోజు రాశులవారీగా ఫలితాలు జరిగాయో లేదో చెక్ చేసుకోండి
రాశుల ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. ఆరోజు తమ జాతకం ఎలా ఉందో? ఏమైనా కలిసివస్తుందా? లేదంటే అడ్డంకులేమైనా ఎదురవుతాయా? వాటిని అధిగమించాలంటే ఏం చేయాలి? అనుకుంటూ ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ తమ రాశి ప్రకారం ఫలితాలను పరిశీలిస్తారు. అయితే సాయంత్రమైన తర్వాత ఈరోజు ఉదయం మనం పరిశీలించిన ప్రకారమే ఫలితాలు వచ్చాయా? లేదా? అని ఎవరూ పరిశీలించుకోరు. కాకపోతే ఒకసారి చెక్ చేసుకుంటే అవగాహన వస్తుంది. ఈరోజు బుధవారం కాబట్టి ఎటువంటి ఫలితాలు వచ్చాయో పరిశీలించండి.
మేష రాశి : స్థిరాస్తికి సంబంధించిన కొనుగోలు ప్రక్రియ విజయవంతమవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగానే ఉంటాయి.

వృషభ రాశి : ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అయితే ఖర్చులను నియంత్రించుకోవాలి. పిల్లల్లో ఒకరికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులకు, స్నేహితులకు సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి.
మిథున రాశి : ధనానికి సంబంధించిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారాలు బాగానే ఉంటాయి. లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆహారం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకరాశి : ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి జీవితంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. అనుకున్న పనులు పూర్తవడంతోపాటు ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి.
సింహ రాశి : మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేసి ఇబ్బందులు చేతులారా కొని తెచ్చుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవాలి.. పొదుపు పాటించాలి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విదేశీ ప్రయాణానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
కన్య రాశి : బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. కొత్త ఆలోచనలతోపాటు కొత్త ప్రణాళికలను అవలంబిస్తారు. వ్యాపారాల్లో లాభాలు సాధారణంగా ఉంటాయి. ఎవరితోను ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
తుల రాశి : ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువవుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. సన్నిహితులతో అపార్థాలు తలెత్తుతాయి.
వృశ్చిక రాశి : అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ఎందుకు ప్రయాణాలు చేస్తున్నారో వాటి ఫలితాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలకు, మార్కెట్ స్పెక్యులేషన్ కు దూరంగా ఉండటం మంచిది.
ధనుస్సు : ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. అనుకున్నట్లుగానే పనులు పూర్తవుతాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలుంటాయి. ఆలోచనలు, నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి.
మకర : ఉద్యోగంలో శుభవార్తను వింటారు. ఓర్పు, సహనంతో వ్యవహరిస్తే అనుకున్నవి చేతికందుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దడంలో పెద్దల సహకారం ఉంటుంది.
కుంభరాశి : వృత్తి ఉద్యోగాల్లో డిమాండ్ ఉంటుందికానీ ఆశించిన స్థాయిలో సంపాదన ఉండదు. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట ఊహించని ఖర్చులుంటాయి. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు.
మీనరాశి : ఆలోచనలు వ్యాపారాల్లో సత్ఫలితాలను ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ అనవసర ఖర్చులుంటాయి.












Click it and Unblock the Notifications