horoscope today: 2025 చివరిరోజు.. ఎంజాయ్మెంట్ అంతా వీళ్ళదే

డిసెంబర్ 31 2025. ఈరోజుతో 2025 కు శుభం కార్డు పడుతుంది. రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈరోజు ద్వాదశ రాశులలో గ్రహాల సంచారం ఆయా రాశుల వారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం చివరి రోజు ఏ రాశుల వారికి బాగుంటుంది అనేది తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ రంగంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. కుటుంబ విషయాల్లో ఆవేశాన్ని నియంత్రించుకోవాలి.

December 31 Horoscope Results this year last day 12 Zodiac Signs Predictions

వృషభ రాశి
వృషభ రాశి వారికి నేడు ప్రయాణ సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం.

మిథున రాశి
మిధున రాశి జాతకులకు నేడు సంవత్సరం చివరి రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మంచిది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. మంచి వార్తలు అందుతాయి.

సింహ రాశి
సింహరాశి జాతకులకు పనిభారం పెరిగినా, ఫలితం సానుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.

కన్య రాశి
కన్యా రాశి వారికి నేడు సృజనాత్మకత పెరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది.

తుల రాశి
తులారాశి జాతకుల ఇంటి విషయాలు ప్రాధాన్యం పొందుతాయి. ఆస్తి సంబంధిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సహనం అవసరం.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు మాట్లాడే విధానం విజయాన్ని ఇస్తుంది. చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం.

మకర రాశి
మకర రాశి జాతకులకు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగుదల కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కుంభ రాశి
నేడు కుంభ రాశి వారి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. విశ్రాంతి అవసరం.

మీన రాశి
మీన రాశి వారికి స్నేహితుల సహకారం లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్య సాధనలో ముందడుగు పడుతుంది.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+