2026లో లాభనష్టాలు పొందే రాశులు ఇవే
కొత్త సంవత్సరం వస్తుందంటేనే ఎంతోమందికి ఆశలుంటాయి. ఆర్థికంగా కలిసివస్తుందని, అన్ని పనులు పూర్తవుతాయని, శుభకార్యాలు జరుగుతాయని... ఇలా అనేకరకాల కోరికలతో ఉంటారు. అవన్నీ తీరతాయని కోరుకుంటుంటారు. కొత్త సంవత్సరంలో కొన్ని రాశులపై గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడి ప్రభావం ఉంటోంది. దీనివల్ల వారికి ఆర్థికంగా, సామాజికంగా లాభాలున్నాయి. ఈ ఏడాదిలో పెద్ద గ్రహాలు రాశి సంచారంతోపాటు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. 2026లో లాభపడే రాశులు, నష్టపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.
వృశ్చిక రాశి, మీన రాశి
ఈ రాశివారు కొత్త సంవత్సరంలో ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. లేదంటే భారీగా నష్టపోతారు. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. డబ్బును పొదుపు చేయడంపైనే వీరు దృష్టిపెట్టాలి.

కర్కాటక రాశి, కుంభరాశి
ఆదాయం వనరులు వీరికి బాగా పెరుగుతాయి. వీరు కూడా ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టే క్రమంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు పెద్దల నుంచి సలహాలు తీసుకోవాలి. వారి సూచనల మేరకే పెట్టుబడులు పెట్టాలి. కష్టపడి పనిచేసి మంచి ఆదాయాన్ని పొందుతారు.
వృషభ రాశి, కన్యారాశి
కొత్త సంవత్సరం ఈ రాశులవారికి బాగా కలిసివస్తోంది. ఉద్యోగాల పరంగా, వ్యాపారాల పరంగా వీరికి మంచి ఆర్జన ఉంటుంది. ఒకరకంగా ఈ సమయం వీరికి అంతా శుభాలనే కలుగజేస్తోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. గతంలో కంటే ఆర్థికంగా ఇప్పుడు బలపడతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ప్రయత్నం ఎంత బలంగా ఉంటే వీరికి అంత త్వరగా ఫలితాలు కలుగుతాయి.
తులా రాశి, మకర రాశి
ఒకరకంగా 2026 ఏడాది వీరికి అద్భుతమని చెప్పొచ్చు. కొన్ని సమస్యల నుంచి చాలా తేలికగా ఉపశమనం లభిస్తుంది. గతంలో కంటే ఆదాయం భారీగా పెరుగుతుంది. రుణ సమస్యలన్నీ తీరిపోతాయి. కొత్త సంవత్సరం మొత్తం ఈ రెండు రాశులకు చాలా బాగుంటోంది.
మేష రాశి, సింహరాశి
ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీనివల్ల బడ్జెట్ తగ్గుతుంది. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పని తలపెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ పట్టుదలతో కృషిచేయాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి వాటిని పూజించడంవల్ల సమస్యల నుంచి బయటపడతారు.












Click it and Unblock the Notifications